Kakinada : కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతి

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు సమాచారం.

Kakinada : కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. పెద్దాపురం మండలం జి. రాగంపేట అంబటి ఆయిల్స్ ఫ్యాక్టరీలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రపర్చేందుకు ట్యాంకర్‌లోకి దిగిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారంతా ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు పాడేరుకు చెందినవారు కాగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరకు చెందిన వారిగా గుర్తించారు.

Punjab: పంజాబ్‭లో బీభత్సం.. పోలీసుల మీదకు కత్తులు దూసిన నిరసనకారులు

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతుల్లో కుర్రా రామారావు (54), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. పులిమేరకు చెందిన మృతుల్లో కట్టమూరి జగదీశ్, ప్రసాద్ ఉన్నట్లు గుర్తించారు.

 

పెద్దాపురం జి. రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘనటపై మంత్రి దాశెట్టిరాజా ఆరాతీశారు. ఏడుగురు మరణించడం బాధాకరమని అన్నారు. ఘటన వివరాలను జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని అధికారులకు మంత్రి ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు