ఏపీలో రైలు సర్వీసులు-ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవు

  • Edited By: murthy , June 3, 2020 / 07:40 AM IST
ఏపీలో రైలు సర్వీసులు-ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  రైలు సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ అనుమతించింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కోవిడ్ 19  పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రైల్వే స్టేషన్లలోనూ తగినంత మంది సిబ్బంది లేకపోవటంతో పలు రైళ్లకు సంబంధించి హాల్టింగ్ స్టేషన్ల సంఖ్యను తగ్గించారు.

దీనివల్ల ప్రయాణికుల రద్దీకూడా తగ్గే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన 22 రైళ్లకు హాల్టింగ్‌ స్టేషన్లు తగ్గనున్నాయి. జూన్ 4 నుంచి ఈనిర్ణయం అమల్లోకి వస్తుంది. రద్దు చేసిన స్టేషన్లలో రైలు ఎక్కడానికి, దిగడానికి టికెట్లను అడ్వాన్సుగా బుక్‌ చేసుకున్న వారికి చార్జీలను పూర్తిస్థాయిలో తిరిగి చెల్లించనున్నారు. 

రాష్ట్రంలో హాల్ట్ లు రద్దయిన స్టేషన్లు ఈ విధంగా ఉన్నాయి
> సికింద్రాబాద్‌-హౌరా(ఫలక్‌నుమా): పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగదు.
> సికింద్రాబాద్‌-గుంటూరు(గోల్కొండ): కొండపల్లి, రాయనపాడు, కృష్ణాకెనాల్‌, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగదు. 

> గుంటూరు-సికింద్రాబాద్‌(గోల్కొండ): కొండపల్లి, రాయనపాడు, నంబూరు, పెదకాకాని స్టేషన్లలో ఆగదు. 
> హైదరాబాద్‌-విశాఖ(గోదావరి): తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగదు. 

> తిరుపతి-నిజామాబాద్‌(రాయలసీమ): రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి స్టేషన్లలో ఆగదు. 
> ముంబై-భువనేశ్వర్‌(కోణార్క్‌): తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగదు. 

> ముంబై-బెంగళూరు(ఉద్యాన్‌): ఆదోని, గూటి, ధర్మవరం, ప్రశాంతి నిలయం, పెనుకొండ, హిందూపురంలో ఆగదు.

> దానాపూర్‌-బెంగళూరు(సంఘమిత్ర): గూడూరులో ఆగదు.
> బెంగళూరు-దానాపూర్‌(సంఘమిత్ర): రేణిగుంట, గూడూరులలో ఆగదు.

> విశాఖపట్నం-న్యూఢిల్లీ(ఏపీఎక్స్‌ప్రెస్‌): రాజమండ్రి, ఏలూరు, బెజవాడలో ఆగుతుంది. 
> యశ్వంత్‌పూర్‌-హౌరా(దురంతో): విజయవాడ, రేణిగుంటలో ఆగుతుంది. విజయనగరంలో ఆగదు.  

కాగా…..బెంగళూరు-నిజాముద్దీన్‌(రాజధాని): గుంతకల్‌, అనంతపురం స్టేషన్లలో ఆగుతుంది. నిజాముద్దీన్‌-చెన్నై(బై వీక్లీ): విజయవాడలో ఆగుతుంది.

Read: 11న ఏపీ కేబినెట్ భేటీ