వైకుంఠ ద్వార దర్శనం..చిన్న జీయర్ స్వామి క్లారిటీ

  • Published By: madhu ,Published On : December 14, 2019 / 12:08 PM IST
వైకుంఠ ద్వార దర్శనం..చిన్న జీయర్ స్వామి క్లారిటీ

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వెంకటేశ్వర స్వామి 10 రోజుల పాటు.. వైకుంఠ ద్వారం గుండానే వచ్చివెళ్తారని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల.. భక్తులు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం చేసుకోవచ్చన్నారు.

వచ్చే ముక్కోటి ఏకాదశి నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు కల్పించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ కొత్త విధానంపై.. హిందూ ధార్మిక సంస్థలు, కొన్ని పార్టీలు, కొందరు భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం మీడియాతో చిన జీయర్ మాట్లాడారు. 

ఎక్కువ అభిషేకాల వల్ల ఉత్సవమూర్తులకు నష్టం కలిగే అవకాశం ఉందని చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్సవమూర్తులకు అభిషేకాలను తగ్గించుకోవాలని సూచించారు. ద్రవ్యాలతో చేసే అభిషేకం కంటే..శుద్ధ జలంతో చేయడం బెటర్ అని సూచించారు.

కళ్లు, ముక్కు, నోరు క్రమంగా క్రమంగా లోపించి పోతాయన్నారు. ఆర్జిత సేవలు ఎక్కువైనప్పుడు..భగవంతుడి మూర్తికి లోపం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ సేవలను ఎంతవరకు అంగీకరించవచ్చో..ఒక నియమాన్ని పెట్టుకోవాలని సూచించారు జీయర్ స్వామి. ఏడాదికి.. 45 అభిషేకాలు చేస్తే సరిపోతుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే…చిన జీయర్ స్వామి అమెరికాకు వెళ్లనున్నారు. 

* డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం సందర్భంగా.. డిసెంబర్ 30 వరకు చినజీయర్ స్వామి అమెరికాలో ఉండనున్నారు. 
* వివిధ చోట్ల నిర్వహించే.. ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. 
* అనంతరం గుంటూరుకు వెళ్లనున్నారు. 
* జనవరి 1 నుంచి.. 15 వరకు గుంటూరులో జరిగే వెంకటేశ్వర స్వామి పూజల్లో పాల్గొంటారు చిన జీయర్ స్వామి.