విశాఖ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది ఆ మూడే

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 03:31 AM IST
విశాఖ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది ఆ మూడే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తో, రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ను చిత్ర యూనిట్ వైజాగ్‌లో నిర్వహించింది.
 
వైజాగ్ గురించి డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది మూడు అని చెప్పారు. అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్శిటీ. ఆహ్లాదకరమైన బీచ్. శ్రీ శ్రీ ఇక్కడే మహాప్రస్థానం సంచికలు పట్టుకుని రోడ్లపై తిరిగి.. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం.. అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అంటూ ఈ శతాబ్ధపు కవిత్వాన్ని ఉర్రూతలూగించారని చెప్పారు.

ala

చలంగారు, రావిశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు.. ఇలాంటి మహానుభావుల్ని ఎందరినో అందించిన సుందరమైన ఓ పొయెట్రిలాంటి, కృష్ణశాస్త్రి రాసిన అందమైన పద్యం లాంటి.. ఎన్నో ఒంపులున్న మహానగరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చెప్పారు. చదువుకునే రోజుల్లో తనకు ఎన్నో జ్ఞాపకాలు అందించిన ఆర్కే బీచ్ రోడ్డుకి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నో ఆలోచనలు.. ఉత్తేజిత పూరితమైన భవిష్యత్తుకి బాటలు వేసిన విశాఖఈ నగరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు త్రివిక్రమ్.
 

rk
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ప్రశంసలు కురిపించారు త్రివిక్రమ్. ఈ సినిమాని తమన్ తన భుజం మీద మోసుకొచ్చాడని చెప్పారు. అందుకనే ఇంత ఆదరణ.. ఇన్ని కలెక్షన్స్.. ఇంత అభిమానం అని చెప్పారు. విలువలతో సినిమా తీయండి, మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని ప్రేక్షకులు నిరూపించడం అన్నిటికంటే ఎంతో ఆనందం కలిగించిన విషయం అన్నారు. అది మాకే కాదు తెలుగు సినిమాకు నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.

Also Read : అరటిపళ్లు అమ్మాను… ఆఫీస్ బాయ్ గా పని చేశాను : డైరెక్టర్ మారుతి