TTD Old Currency notes: శ్రీవారి ఖజానాలో రూ.49 కోట్ల పాతనోట్లు ఏంచేయాలి?

టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాతనోట్లు మొత్తం రూ.49.70 కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యి, 6.34 లక్షల రూ.500 పాత నోట్లు ఉన్నాయి. వీటిని ఏంచేయాలో అనే ఆలోచనలు పడింది టీటీడీ.

TTD Old Currency notes: శ్రీవారి ఖజానాలో రూ.49 కోట్ల పాతనోట్లు ఏంచేయాలి?

Ttd Again And Again Request To Central Government Over Rs 49 Crore Old Currency Notes Issue

Old Currency notes In TTD : పాత రూ.500లు రూ.1000 నోట్లు రద్దు కావటం కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చి వాటి లావాదేవీలు కొనసాగుతునే ఉన్నాయి. ఈక్రమంలో మరి మన దగ్గర పాత నోట్లు ఉంటే చేయాలి? అని సందిగ్ధ పడతాం. ఒకటీ రెండూ ఉంటే వాటిని జ్ఞాపకాలుగా ఉంచేసుకోవచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఈ పాత నోట్ల తలనొప్పి తయారైంది. టీటీడీ వద్ద పాత నోట్లు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని ఏంచేయాలతో అర్థంకాని పరిస్థితిలో ఉంది టీటీడీ.

ఈక్రమంలో టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాతనోట్లు మొత్తం రూ.49.70 కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యి, 6.34 లక్షల రూ.500 పాత నోట్లు ఉన్నాయి. వీటిని ఏంచేయాలో అనే ఆలోచనలు పడింది టీటీడీ. దీనికి సంబంధించి గతంలో టీటీడీ పూర్వ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాలుగుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లను ఏంచేయాలి? సమాధానం చెప్పాలంటూ పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. కానీ ఫలితం లేదు. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

దీంతో భక్తులు మొక్కులుగా శ్రీవారికి సమర్పించిన పాతనోట్లను ఏం చేయాలో తెలీక టీటీడి అయోమయంలో పడిపోయింది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు ఇటీవల జరిగిన సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వటంలేదనీ..కానీ వీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకోలేమని మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాతనోట్లు రద్దు చేసి ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది. ఇన్నాళ్లయిన టీటీడీ విన్నపాలను పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఈక్రమంలో ఈ పాత నోట్లను ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడింది టీటీడీ పాలక మండలి. మరి కేంద్రం ఎప్పటికీ స్పందించకపోతే టీటీడీ వ‌ద్ద ఉన్న రూ.49.70కోట్ల పాత‌నోట్ల‌ను నిర్వీర్యం చేయానుందా?.. మరి ఈ నోట్ల గురించి టీటీడీ ఏం చేయనుందో వేచి చూడాలి.

కాగా..2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేసినప్పటికీ భక్తులు మాత్రం తమవద్ద ఉన్న పాత నోట్లను స్వామివారికి సమర్పిస్తూ వచ్చారు. అలా ఇప్పటి వరకు టీటీడీ వద్ద రూ.49.70 కోట్లు రద్దు చేయబడిన పాత నోట్లు జమ అయ్యాయి. దీనిపై టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు వహిస్తున్న వైవీ సుబ్బారెడ్డి గత రెండేళ్లలో నాలుగు సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి పాత నోట్ల డిపాజిట్‌ చేసుకోవాలని కోరారు. అయితే టీటీడీ వద్ద నిల్వ ఉన్న పాతనోట్లను రిజర్వ్‌ బ్యాంకులో గానీ, ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్‌ చేయడానికి అనుమతించాలని సుబ్బారెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేసిన కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాకపోవటంతో ఆ పాత నోట్లను టీటీడీ ఏంచేయనుందో వేచి చూడాలి..

కాగా..భక్తుల నుండి నిత్యం వచ్చే కానుకలతోనే టిటిడి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు అందించిన నగదు కానుకలను నిర్వీర్యం చేసేందుకు టిటిడికి మనసంగీకరించటంలేదట. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల సహకారంతో కేంద్రంపై వత్తిడి తీసుకుచ్చి కోట్లల్లో ఉన్న పాతనగదును రిజర్వు బ్యాంకులో జమచేసి తిరిగి కొత్త నగదు పొందేలా చొరవచూపిస్తే బాగుంటుందని భక్తులు, ధార్మిక సంస్ధలు అభిప్రాయపడుతున్నాయి.