TTD : నేడు టీటీడీ బోర్డు సమావేశం..సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీపై నిర్ణయం

ఇవాల్టి సమావేశంలో మూడు నెలల కాలానికి అవసరమైన బియ్యం పప్పు దినుసులు నూనెలు, నెయ్యి, చక్కర బెల్లం తదితర అవసరాల కొనుగోళ్లకు సంబంధించి పాలక మండలి ఆమోదం తెలుపనుంది.

TTD : నేడు టీటీడీ బోర్డు సమావేశం..సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీపై నిర్ణయం

Ttd

TTD board meeting : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఇవాళ అన్నమయ్య భవన్‌లో జరగనుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధిక రద్దీ కారణంగా తిరుపతిలో ఇటీవల నిలిపివేసిన సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ పునరుద్ధరణపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.

ఇవాల్టి సమావేశంలో మూడు నెలల కాలానికి అవసరమైన బియ్యం పప్పు దినుసులు నూనెలు, నెయ్యి, చక్కర బెల్లం తదితర అవసరాల కొనుగోళ్లకు సంబంధించి పాలక మండలి ఆమోదం తెలుపనుంది. ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న టీటీడీ ఉద్యోగుల సమస్యలను కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీ నగర్‌లో ఇళ్లను రెగ్యులరైజ్ చేయడం దుకాణాలు, హాకర్ లైసెన్సులకు రెన్యువల్ తదితర అంశాలపై పాలక మండలిలో చర్చించనున్నారు.

Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌కు సంబంధించి స్థలం కేటాయింపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ నిన్న శ్రీవారి ఆలయంలో టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

గతేడాది వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గం రిపేరు పూర్తయింది. పునరుద్ధరణ పనులన్నీ దాదాపు పూర్తికావడంతో వచ్చే వారం తిరిగి ప్రారంభించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. గతేడాది భారీ వర్షాలకు మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ.. ఇంజినీర్లతో ఆ మార్గాన్ని త్వరితగతిన రిపేరు చేయించింది.