క్రిమినల్ కేసులు పెడతాం, హీరో సూర్య తండ్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల గురించి ప్రముఖ హీరో సూర్య తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శివకుమార్ వ్యాఖ్యలపై రచ్చ జరిగింది.

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 05:08 AM IST
క్రిమినల్ కేసులు పెడతాం, హీరో సూర్య తండ్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల గురించి ప్రముఖ హీరో సూర్య తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శివకుమార్ వ్యాఖ్యలపై రచ్చ జరిగింది.

తిరుమల గురించి ప్రముఖ హీరో సూర్య తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శివకుమార్ వ్యాఖ్యలపై రచ్చ జరిగింది. శివకుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై శివకుమార్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. ఆయన కామెంట్స్ పై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. కాగా, తిరుమల గురించి ఆయన అన్న మాటలు ఇప్పుడు అన్నవి కాదని విచారణలో తేలిందన్నారు. ఏది ఏమైనా తిరుమల గురించి ఏ వ్యక్తి అయినా తప్పుగా మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

తిరుమల గురించి శివకుమార్ ఏమన్నారంటే:
తిరుమల క్షేత్రంపై హీరో సూర్య తండ్రి శివకుమార్ సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఎవరూ వెళ్లొద్దని ఆయన అన్నారు. తిరుమలలో డబ్బున్న వారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌ హౌస్‌లు ఇస్తారని మండిపడ్డారు. సామాన్యులకు కనీసం దర్శనం కల్పించకుండా తోసేస్తారని శివకుమార్‌ వాపోయారు. అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై తమిళనాడుకి చెందిన శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ ఈ-మెయిల్ ద్వారా టీటీడీకి సమాచారం ఇచ్చారు. శివకుమార్ ఉద్దేశపూర్వకంగానే తిరుమల పవిత్రను కించపరిచారని ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై తిరుమల పోలీసులు ఏప్రిల్ 29న కేసు నమోదు చేశారు. 

తిరుమలపై దుష్ప్రచారం చేసిన 8మందిపై కేసులు:
శ్రీవారి ఆలయంపై దుష్పచారం చేస్తున్న వారిపై టీటీడీ విజిలెన్స్ దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన 8మందిపై పోలీసులు కేసులు పెట్టారు. అందులో హీరో సూర్య తండ్రి కూడా ఉన్నారు. తిరుమల పవిత్రతను కించపర్చే వారిని ఊపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. టీటీడీ బోర్డు మెంబర్ సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారంటూ… ఫేస్ బుక్ లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపైనా.. కేసు నమోదు చేశారు తిరుమల టూ టౌన్ పోలీసులు. తిరుమల ఆలయంలో జూన్ 30 వరకు దర్శనాలు నిలిపివేశారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగర శివరామరాజులు తప్పుడు ప్రచారం చేశారని మరో కేసు పెట్టారు. తిరుమల బౌధ్దారామం అని తలనీలాల సమర్పణ హిందువుల సాంప్రదాయం కాదని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన వారిపైనా కేసు నమోదు చేశారు. బౌద్ధ ఆలయాన్ని ధ్వంసం చేసి వెంకటేశ్వరస్వామి విగ్రహంగా మార్చారంటూ ఫేస్ బుక్ లో ప్రచారం చేశారు. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

Read: సూర్య తండ్రి శివ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేసు