TTD Chairman: తిరుమలకు వచ్చే వీఐపీలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అసంతృప్తి

ఎఫ్ఆర్‭సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్‭సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు

TTD Chairman: వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శలు చేయడానికే వీఐపీలు తిరుమలకు వస్తే ఏమీ చేయలేమని ఆయన అన్నారు. ఆ ఎమ్మెల్యే 28 మందిని తీసుకొచ్చారని, అయితే అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కుదరదని అన్నారు. అయినప్పటికీ 18 మందికి ప్రోటోకాల్ కేటాయించామని, వీఐపీలకు నిబంధనల ప్రకారం అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్న ఆయన ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా టీటీడీపై విమర్శలు చేస్తే తాము ఏమీ చేయలేమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోలీసులు

ఎఫ్ఆర్‭సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్‭సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీకి ఉన్న ఎఫ్ఆర్‭సీఏ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో… రెన్యూవల్ చేయాలని ఆర్బీఐని కోరినట్లు తెలిపారు. హుండీలో కానుకల ద్వారా టీటీడీ ఖజనాలో 30 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ఉందని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు