Hanuman Birth place : వెంకటాద్రే అంజనాద్రి తేల్చి చెప్పిన టీటీడీ

హనుమంతుడి జన్మస్ధలం తిరుమల కొండలలోని అంజనాద్రే నని టీటీడీ తేల్చి చెప్పింది.

Hanuman Birth place : వెంకటాద్రే అంజనాద్రి తేల్చి చెప్పిన టీటీడీ

Ttd Confirm Hanuman Birth Place

TTD confirmed lord of Lord Hanuman Birth place is Tirumala : హనుంతుడి జన్మస్ధలం తిరుమల కొండలలోని అంజనాద్రే నని టీటీడీ తేల్చి చెప్పింది.  గత కొంతకాలంగా హనుంతుడి జన్మస్ధలంపై వస్తున్న వార్తలపై ఆధారాలు సేకరించేందుకు టీటీడీ గతేడాది డిసెంబర్ లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

హనుమంతుడి జన్మస్ధలంపై నియమించిన కమిటీ పలు పురాణ,వాజ్మయ ,శాసన, భౌగోళిక చారిత్రక ప్రమాణాల ఆధారంగా తిరుమల కొండల్లోని అంజనాద్రిలోనే ఆంజనేయుడు పుట్టాడని ఆయన ప్రకటించింది. తాము సేకరించిన ఆధారాలతో… అంజనాద్రిపై ఉన్న జాపాలి తీర్థమే హనుంతుని జన్మస్ధలం అని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర శర్మ చెప్పారు.

నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించారని ఆయన చెప్పారు. ఈ రోజు తిరుపతి లోని నాద నీరాజనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… వెంకటాచలాన్ని పురాణాల్లో అంజనాద్రి అని పిలేచే వారని, ఆకాశ గంగ తీర్ధంలో 12 ఏళ్లు అంజనా దేవి తపస్సు చేసిందని తెలిపారు.

అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని ఆయన అన్నారు. వీటికి రుజువుగా పౌరాణిక,,వాజ్మయ శాసన చారిత్రక ఆధారాలను సమర్పించింది కమిటీ. 12 పురాణాల్లో హనుమంతుడి జన్మస్ధలం తిరుమల లోని అంజనాద్రే అని స్పష్టంగా ఉందని అయన వివరించారు. వెంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయని ఆయన వివరించారు. వెంకటాద్రినే అంజనాద్రి అని ఆయన అధికారికంగా ప్రకటించారు.

హనుమంతుడి జన్మస్థలంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టీటీడీ ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. శ్రీరామనవమి నాడు హనుమంతుని జన్మ స్థలం పై టిటిడి అధికారికంగా ప్రకటన చేయటంతో భక్తులు ఆనందోత్సాహాల్లో  ఉన్నారు.