Hanuman Janmabhoomi : హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విమర్శలకు టీటీడీ కౌంటర్

ఆంజనేయుడు జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. హనుమాన్ ట్రస్ట్ రాసిన లేఖకు టీటీడీ అధికారులు సమాధానం ఇచ్చారు.

Hanuman Janmabhoomi : హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విమర్శలకు టీటీడీ కౌంటర్

Hanuman Janmabhoomi

TTD counter : ఆంజనేయుడు జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. హనుమాన్ ట్రస్ట్ రాసిన లేఖకు టీటీడీ అధికారులు సమాధానం ఇచ్చారు. హనుమాన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవింద సరస్వతి స్వామికి హనుమాన్ ట్రస్టు చేసిన విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు వారి స్థాయికి తగ్గట్టు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా పరిశోధనల తర్వాతే ఆంజనేయుడి జన్మస్థలంపై ప్రకటన చేశామని స్పష్టం చేశారు.
తమ ప్రకటనపై అభ్యంతరం ఉంటే హనుమాన్ ట్రస్టు దగ్గర ఉన్న ఆధారాలను ఈనెల 20లోగా ఇవ్వాలని కోరారు.

కరోనా తర్వాత హనుమాన్ ట్రస్ట్ సభ్యుల్ని తిరుమలకు ఆహ్వానిస్తామని టీటీడీ అధికారులు రాసిన లేఖలో తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్వామికి టీటీడీ ప్రత్యుత్తరం రాసింది. హనుమంతుడి తిరుమలలోనే జన్మించాడంటూ టీటీడీ చేసిన ప్రకటనపై కర్నాటకలోని హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తీవ్ర వ్యక్తం చేసింది. టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసింది.

టీటీడీ ప్రకటనను కర్నాటక హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టింది. ఈ మేరకు టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసింది. అజ్ఞానపు, మూర్ఖపు పనులు చేయవద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది. కల్పితాలు సృష్టించవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేసింది. శాస్త్రీయ ఆధారాలతో వారంలోగా తమ లేఖకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తామే తిరుమల వచ్చి తప్పును నిరూపిస్తామని హెచ్చరించింది. దీంతో హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు రాసిన లేఖకు టీటీడీ అధికారులు సమాధానం ఇచ్చారు.