యాడ్ ఫ్రీ ఛానెల్ గా ఎస్వీబీసీ..దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ప్రసారాలు

  • Published By: bheemraj ,Published On : July 30, 2020 / 10:11 PM IST
యాడ్ ఫ్రీ ఛానెల్ గా ఎస్వీబీసీ..దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ప్రసారాలు

ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో భగవద్గీత, గరుడ పురాణ కార్యక్రమాలు ఎస్వీబీసీలో ప్రసారమవుతాయని తెలిపారు.



భక్తుల దర్శనాల సంఖ్యను ఇప్పట్లో పెంచే పరిస్థితి లేదన్నారు. కరోనా సోకిన అర్చకులందరూ కోలుకుంటున్నారని తెలిపారు. చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న పెద్దజీయర్ స్వామి త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.

కళ్యాణమహోత్సవ సేవను త్వరలో ఆన్ లైన్ లో నిర్వహిస్తామని వెల్లడించారు. కళ్యాణం టిక్కట్లు కొనుగోలు చేసిన భక్తుల ఇళ్లకు శ్రీవారి ప్రసాదం, శేష వస్త్రం పంపుతామని తెలిపారు.