బాలాజీ బడ్జెట్ : జమ్మూ, ముంబై, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 09:51 AM IST
బాలాజీ బడ్జెట్ : జమ్మూ, ముంబై, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 3 వేల 309 కోట్ల బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరం కంటే..రూ. 60 కోట్ల బడ్జెట్ అంచనాలు పెరిగింది. హుండీ ద్వారా రూ. వేయి 351 కోట్లు, వడ్డీల ద్వారా రూ. 706 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ. 400 కోట్లు వస్తుందని అంచనా వేసింది.
Also Read | అత్యద్భుతమైన ’చెత్త పార్కు’.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు 

2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఉదయం ఈ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారావు మీడియాకు తెలిపారు. రూ. 18 కోట్లతో అన్ని క్వార్టర్స్ ఆధునీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. బూందీపోటులో అగ్నిప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు రూ. 3.3 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కోసం రూ. 8.5 కోట్లు కేటాయించారు. చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయించారు. మెట్రో గురించి ఏమీ మాట్లాడలేదని, అధ్యయనం చేస్తున్నారని, అనంతరం నివేదిక ఇచ్చిన తర్వాత..మాట్లాడుతామన్నారు వైవి సుబ్బారెడ్డి. 

* తిరుపతి బధిర పాఠశాల నిర్మాణానికి రూ. 34 కోట్లు. 
* అలిపిరి – చెర్లోపల్లి బైపాస్ రోడ్డు విస్తరణకు రూ. 16 కోట్లు. 
* టీటీడీలో ప్రత్యేక సైబర్ సెక్యూర్టీ విభాగం ఏర్పాటు. 

* అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు టోల్ గేట్ ఫీజు మినహాయింపు.
* అలిపిరి టోల్ గేట్ వద్ద కార్లకు టోల్ ఫీజు రూ. 15 నుంచి రూ. 50కి పెంపు. 
* భారీ వాహనాలకు టోల్ గేట్ ఫీజు రూ. 100 నుంచి రూ. 200 పెంపు. 
 

* ఆలయాల భద్రత కోసం 1300 సీసీ కెమెరాల కొనుగోలు. 
* హైదరాబాద్ జూబ్లి హిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి, కళ్యాణ మండపం, వాహన మండపం నిర్మించాలని నిర్ణయం. 
* జమ్మూ, ముంబై, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేందుకు అనుమతులు. 

టీటీడీ పాలక మండలికి ఫైనాన్షియల్ సబ్ కమిటీ పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో..గతంలో మాదిరిగా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని సూచనలు చేసింది. ప్రతి ఏటా బడ్జెట్ పెరుగుతున్న క్రమంలో సేవా టికెట్లు, వసతి గదుల ధరలను రెండు సంవత్సరాలకు ఒక్కసారి పెంచాలని సూచనలు చేసినట్లు సమాచారం. రూ. 100 కోట్లు సేకరించే లక్ష్యంగా పెట్టుకోవాలంది. 

Read More : ఆరేళ్లలో నల్గొండలో ఫ్లోరోసిస్ కేసు లేదు : గర్వంగా ఉందన్న కేటీఆర్