తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 02:37 PM IST
తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్

కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ వ్యాపించకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా మే నెల వరకు కొనుగోలు చేసిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి గదుల తేదీలు మార్పు చేసుకునే అవకాశంతో పాటు వాటిని రద్దు చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. దీని ద్వారా భక్తులకు దర్శనం తేదీని పోస్టుపోన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు 28 రోజుల పాటు తిరుమలకు రావొద్దని టీటీడీ కోరింది. అవి తగ్గిన తర్వాతే శ్రీవారి దర్శనానికి రావాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతి రోజు 70 వేల మంది నుంచి లక్ష మంది వరకు తిరుమలకు వస్తుంటారు. జన సమూహం ఎక్కువగా ఉంటుంది. అలా వచ్చిన వారిలో ఎవరికైనా కనుక కరోనా వైరస్ ఉన్నట్లైతే.. అది వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక చర్యలు తీసుకుంది. కరోనాపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లెక్సీలు, ప్రసార సాధనాలు, ఎస్వీబీసీ భక్తి చానల్ ద్వారా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టనుంది.

ఎక్కువగా విదేశీ ప్రయాణికులు, విదేశాల్లో పర్యటించి వచ్చిన వారే కరోనా బారిన పడుతున్నారు. దీంతో విదేశీయులు, విదేశాల్లో పర్యటించి వచ్చిన వారు 28 రోజుల తర్వాత తిరుమలకు రావాలని టీటీడీ కోరింది.