TTD Pushpa Yagam: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 11న పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ జరగనుండగా.. నవంబరు 11వ తేదీన యాగ మహోత్సవం...

TTD Pushpa Yagam: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 11న పుష్పయాగం

Tirumala

TTD Pushpa Yagam: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టి.టి.డి ప్రజాసంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ జరగనుండగా.. నవంబరు 11వ తేదీన యాగ మహోత్సవం నిర్వహిస్తారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం పూర్తి చేస్తారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం జరుగుతుంది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా వర్చువల్ ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

……………………………………. : తిరుమలలో ఆ 3 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు