జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం, రోజుకు 7వేల మందికి అనుమతి, 6 నుంచి కొండకు బస్సులు

తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8 నుంచి 3 రోజుల

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 09:24 AM IST
జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం, రోజుకు 7వేల మందికి అనుమతి, 6 నుంచి కొండకు బస్సులు

తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8 నుంచి 3 రోజుల

తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8 నుంచి 3 రోజుల పాటు తొలుత టీటీడీ ఉద్యోగులతోపాటు తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక(ట్రయల్) దర్శనం కల్పించనున్నారు. 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 రోజుల పాటు నిర్వహించే ప్రయోగాత్మక దర్శనంలో భాగంగా కరోనా నియంత్రణ చర్యలను ఎలా అమలు చేయాలన్నది పరిశీలిస్తారు. 

* ప్రతి ఇద్దరు భక్తుల మధ్య తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు. 
* రోజుకు 7వేల మందిని దర్శనానికి అనుమతించేలా చర్యలు. 
* గంటకు 300 మంది వంతున రోజుకు 15 గంటల పాటు భక్తులను అనుమతించేందుకు ప్రణాళిక. 
* టీటీడీలో 7,400 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 14వేల మంది వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సేవల సిబ్బంది ఉన్నారు. స్థానికులు 5 వేల మంది వరకు ఉన్నారు. వారందరికీ అవకాశం కల్పించినా 3 రోజుల్లో దర్శనాలు పూర్తవుతాయని అధికారులు అంచనా.
* సర్వదర్శనాలకు కూడా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం.
* 10 రోజులు గడిచాక భక్తుల సంఖ్యను పెంచాలని భావన.
* ఆర్జిత సేవలకు అప్పుడే భక్తులను అనుమతించకూడదని భావన. 
* ఇప్పటికే క్యూలైన్లలో పలు మార్పులు. 
* ఇనుప కమ్మీలు ఏర్పాటు చేసి క్యూలైన్లలో గీతలు. 
* దర్శనాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే బయటి ప్రాంతాల్లో లడ్డూల విక్రయాన్ని నిలిపేసేందుకు కార్యాచరణ.
* 6 లేదా 7వ తేదీ నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు. వాటిల్లోనూ వ్యక్తిగత దూరం. 
* తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం. 

లాక్ డౌన్ 5వ దశలో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆలయాలు, రద్దీ ఎక్కువగా ఉండే మరో 12 పుణ్యక్షేత్రాల్లో కలిపి మొత్తం 20 ఆలయాల్లో భక్తులకు దర్శనాలపై దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సమక్షంలో అధికారులు చర్చించారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సూచించిన తేదీ ప్రకారం దర్శనాలను ప్రారంభిద్దామని మంత్రి తెలిపారు. కాగా, 8వ తేదీలోపు ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

తిరుమలేశుని రోజుకు సగటున 60 వేల మందికిపైగా దర్శనం చేసుకునే వారు. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చేవారు. అలాంటిది కరోనా లాక్ డౌన్ కారణంగా 2 నెలలకుపైగా వెంకన్న దర్శనం భక్తులకు కరువైంది. 128 సంవత్సరాల తిరుమల చరిత్రలో ఏడుకొండల వాని దర్శనం భక్తులకు లభించకపోవడం ఇదే తొలిసారి. ఇన్ని రోజుల తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతి లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు శ్రీవారిని దర్శించుకుంటామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read: ఏపీలో రైలు సర్వీసులు-ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవు