Tirumala Tirupati: టీటీడీలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదు.. రమణ దీక్షితులు ట్వీట్‌పై అర్చకుల కౌంటర్

తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదని, 142 జీవో ప్రకారం అర్చకులకు అన్ని మర్యాదలు అందుతున్నాయని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు.

Tirumala Tirupati: టీటీడీలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదు.. రమణ దీక్షితులు ట్వీట్‌పై అర్చకుల కౌంటర్

Tirumala Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదని, 142 జీవో ప్రకారం అర్చకులకు అన్ని మర్యాదలు అందుతున్నాయని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. బుధవారం శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విటర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ పేర్కొన్నాడు. బ్రహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతో పాటు, అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిపారసులు అమలు చేయాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. కమిటీ సిపార్సులపై సీఎం జగన్ ప్రకటన చేయకపోవటం నిరాశపర్చిందని పేర్కొన్నారు.

TTD Nitya Annadanam Trust : కోట్లకు కోట్లు.. శ్రీవారి అన్నదానం ట్రస్ట్‎కు కోట్లల్లో విరాళాలు.. రూ.1,502 కోట్లకు చేరిన నిధులు

ట్విట్టర్‌లో రమణ దీక్షితులు వన్‌మాన్ కమిటీ రిపోర్ట్‌ను అమలు చేయాలని చేసిన వ్యాఖ్యలపై ప్రధాన అర్చకుల వివరణ ఇచ్చారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నాలుగు మిరాశీ కుటుంబాలు మంగళవారం తిరుమలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశామని, ఆలయంలో అర్చక విధివిధానాలు జరుగుతున్న తీరును సీఎంకు వివరించడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు జారీ చేసిన 855 జీవో ప్రకారం మా నాలుగు కుటుంబాలు రెగ్యులర్ సర్వీసులో చేరడం సీఎంకు వివరించడం జరిగిందని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. వంశపారంపర్య హక్కులు మర్యాదలు పునరుద్ధరించాలని కోరడం జరిగిందని, దానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదేవిధంగా అర్చకుల కుటుంబాలకు టీటీడీ చేసిన మేలును సీఎంకు వివరించడం జరిగిందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీటీడీలో ప్రస్తుతం వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదని, 142 జీవో ప్రకారం.. అర్చకులకు అన్ని మర్యాదలు అందుతున్నాయని వేణుగోపాల దీక్షితులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రమణ దీక్షితులకు గతంలో మాదిరే ప్రధాన అర్చకులు హోదాలో 80,000 జీతాన్ని టీటీడీ ఇస్తోందని, రమణ దీక్షితుల కుమారులకు కూడా సంభావన అర్చకులుగా సంభావన ఇస్తున్నారని అన్నారు.
రిటైర్ అయిన అర్చకులుకూడా ఆలయానికి వచ్చి స్వామివారి పాదపూజ చేసుకునే విధంగా అవకాశం కల్పించారని అన్నారు. మిరాశి విధానంలో కూడా ఇన్ని సౌలభ్యాలు లేవని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు.