Tirumala : ఒక రోజు ముందే.. శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు జారీ.. తిరుపతి వాసులకే..

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను టీటీడీ జారీ చేసింది. తిరుపతి వాసులకు మాత్రమే వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఒకరోజు ముందుగానే..

Tirumala : ఒక రోజు ముందే.. శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు జారీ.. తిరుపతి వాసులకే..

Tirumala

Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను టీటీడీ జారీ చేసింది. తిరుపతి నగరంలోని ఆరు కేంద్రాల్లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే, తిరుపతి వాసులకు మాత్రమే వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఒకరోజు ముందుగానే టికెట్లు జారీ చేసినట్లు టీటీడీ తెలిపింది.

ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజులకు గాను రోజుకు 5వేల చొప్పున 50వేల దర్శన టికెట్లు జారీ చేసింది టీటీడీ. గతంలో సోమవారం ఉదయం 9గంటలకు టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే ఉదయం ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తే తరలివస్తే కోవిడ్ ముప్పు పెరుగుతుందని భావించిన టీటీడీ ముందస్తుగానే రాత్రి వేళ టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

ఈ నెల 13 నుంచి 22 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా గతేడాదిలానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందించాలని నిర్ణయించింది. సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.

Coffee Tea : కాఫీ తాగటం మంచిదా?..టీ తాగటం మంచిదా?

చైర్మన్‌ కార్యాలయంలో కూడా ఈ పది రోజులూ సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు. అంతేకాదు, జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ రద్దు చేసి, వాటిని కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది టీటీడీ.