జనవరిలో శ్రీవారి ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల

జనవరిలో శ్రీవారి ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల

TTD released online quota of Rs.300 for January 2021 : తిరుమల శ్రీవారి ఆలయం లో జనవరినెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు రూ.300 రూ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేసింది. భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లోనే ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనిటీటీడీ సూచించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుంచి జనవరి3వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఇంతకు ముందే వాటి టికెట్లనువిడుదల చేసిన విషయంతెలిసిందే. అందుచేత జనవరి 4వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఫ్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈరోజు విడుదల చేసింది. తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు
తిరుమల శ్రీవారి సన్నిధిలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జ‌న‌వ‌రి 8న తిరుమల‌నంబి స‌న్నిధికి మలయప్ప స్వామి వేంచేపు చేయనున్నారు. 9, 24వ తేదీల్లో స‌ర్వ ఏకాద‌శి నిర్వహించనున్నారు. 10న శ్రీ తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్షతిరునక్షత్రం, 13న భోగి పండుగ‌, 14న మ‌క‌ర సంక్రాంతి, 15న క‌నుమ పండుగ‌, గోదా ప‌రిణ‌యోత్సవం, తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్సవం, 28న శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి, 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్షతిరున‌క్షత్రం వేడుక నిర్వహించనున్నారు.