తిరుమలలో డ్రోన్‌ కెమెరాల వినియోగంపై టీటీడీ సీరియస్‌

తిరుమలలో డ్రోన్‌ కెమెరాల వినియోగంపై టీటీడీ సీరియస్‌

use of drone cameras in Thirumala : తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చేపట్టిన మహాపాదయాత్రను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. అన్నమయ్య మార్గంలో డ్రోన్ కెమెరాను వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాలు వినియోగించడంపై టీటీడీ సీరియస్‌ అయ్యింది. డ్రోన్‌ కెమెరాను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలనూ డిలీట్‌ చేశారు.

తిరుమలలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ మహాపాద యాత్రను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. అన్నమయ్య మార్గంలో డ్రోన్‌ కెమెరాలను వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో డ్రోన్‌ కెమెరాలు ఎలా వాడుతారని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు.. డ్రోన్‌ కెమెరాను సీజ్‌ చేసి.. అందులో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించారు.