జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం పునః ప్రారంభం

  • Published By: murthy ,Published On : June 2, 2020 / 07:40 AM IST
జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం పునః ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 8 నుంచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.  ఈలోపు టీటీడీ ఉద్యోగులు, స్ధానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు టీటీడీ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

భక్తులు ఒక్కోక్కరు 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్సనం కల్పించాలని  సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి జేఎస్ వీ ప్రసాద్ టీటీడీకి లేఖ రాశారు.  గత 70 రోజులుగా స్వామి వారి దర్శనానికి దూరమైన భక్తులుజూన్ 8 నుంచి శ్రీవారిని  దర్శించుకోనున్నారు.

 

కరోనా లాక్ డౌన్ 5 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాలకు సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా జూన్ 8 నుంచి  దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లోకి భక్తులకు  ప్రవేశం  కల్పించవచ్చని తెలిపింది.  ఈ క్రమంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి అనుమతి పొందటంతో  ఇక శ్రీవారి దర్శనం అందుబాటులోకి రానుంది. 

Read: నిమ్మగడ్డపై పిటిషన్‌ను హైకోర్టులో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం