TTD Ecolostic Bag :పిండి పదార్థంతో చేసిన ప్యాకింగ్ లో తిరుపతి లడ్డూ

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్‌)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది.

TTD Ecolostic Bag :పిండి పదార్థంతో చేసిన ప్యాకింగ్ లో తిరుపతి లడ్డూ

Ttd Ecolostic Bag

TTD Laddu Ecolostic Bag : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎంత పవిత్రమో అంత రుచి. ఈ లడ్డూ రుచి దేనికీ ఉండది. శ్రీవారి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉన్నా లడ్డూ ప్రసాదం ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలో ఈ లడ్డూ ప్రసాదాలను ఇకనుంచి ఓ ప్రత్యేకమైన కవర్ ప్యాకింగ్ లో అందించనుంది టీటీడీ. ఆ కవర్ పర్యావరణహితమైనది. భూమిలో చాలా త్వరగా కలిసిపోతుంది. కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీలు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు టీటీడీ అంగీకరించింది.

ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవటానికి వందల ఏళ్లు పడుతుంది. ఇటువంటి కవర్ల వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్‌)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ రామ్‌మనోహర్‌బాబు తెలిపారు.

ప్రమాదకర సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం, డీఆర్‌డీవోతో కలసి హైదరాబాద్‌ నగరంలోని చర్లపల్లి ఇండ్రస్టియల్ ఏరియాలోని ఎకొలాస్టిక్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్‌)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవితో కలసి విడుదల చేశారు.ఈ సందర్భంగా రామ్‌మనోహర్‌బాబు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమితో పాటు నీరు కూడా కలుషితం అయిపోతోంది. జలచరాలకు ప్రాణాంతకంగా మారుతోందని ప్లాస్టిక్ కు బదులుగా ఎకొలాస్టిక్‌ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ను వాడటం అవసరమని అన్నారు.