Tirumala : వారికి మాత్రమే.. 10 నుంచి తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు

జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Tirumala : వారికి మాత్రమే.. 10 నుంచి తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు

Tirumala

Tirumala : జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కేవలం తిరుపతి వాసులకు మాత్రమే సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. దీనికోసం తిరుపతిలో 5 చోట్ల టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. టోకెన్ల జారీ కేంద్రాలను అదనపు ఈవో పరిశీలించారు.

iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

”10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తాం. మున్సిపల్ కార్యాలయం, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల, ముత్యాలరెడ్డి పల్లె, రామచంద్ర పుష్కరిణి దగ్గర టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తాం. టికెట్ పొందిన భక్తులను ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు అనుమతిస్తాం. భక్తులందరూ కరోనా నిబంధనలను తప్పక పాటించాలి” అని ధర్మారెడ్డి సూచించారు.

WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

ఈ నెల 13 నుంచి 22 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా గతేడాదిలానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందించాలని నిర్ణయించింది. సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. చైర్మన్‌ కార్యాలయంలో కూడా ఈ పది రోజులూ సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు. అంతేకాదు, జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను రద్దు చేసి, వాటిని కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది టీటీడీ.