Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల

అలాగే ఆగస్టుకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జూలై నెలకు అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల

Tirumala

Tirumala : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు వెబ్‌సైట్‌తో పాటు గోవింద యాప్‌ ద్వారా విడుదల చేయనున్నారు.

అలాగే ఆగస్టుకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జూలై నెలకు అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. జూలై, ఆగస్టు నెలలకు వర్చువల్‌ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్‌ రేపు ఉదయం 9 గంటల నుంచి మొదలుకానుంది.

Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ

ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. కరోనా తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకుంటున్నారు.