TTD : వ్యాపార రంగంలోకి టీటీడీ..రెండు కంపెనీలతో ఒప్పందం

ఓ నూతన వ్యాపార రంగంలోకి టీటీడీ అడుగుపెట్టనుంది. అగరుబత్తీలు విక్రయంతో పాటు గో పంచగవ్యాలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించనుంది.

TTD : వ్యాపార రంగంలోకి టీటీడీ..రెండు కంపెనీలతో ఒప్పందం

Ttd

TTD Agarbattis : ఓ నూతన వ్యాపార రంగంలోకి టీటీడీ అడుగుపెట్టనుంది. అగరుబత్తీలు విక్రయంతో పాటు గో పంచగవ్యాలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించనుంది. ఇందుకోసం దేశీయంగా గుర్తింపు తెచ్చుకున్న రెండు కంపెనీలతో టీటీడీ ఒప్పందం చేసుకోనుంది. పెద్దగా లాభాలు ఆశించకుండా ఈ వ్యాపారం నిర్వహించాలని దేవస్థానం భావిస్తోంది. పైగా వీటి ద్వారా వచ్చే ఆదాయం గోసంరక్షణ ట్రస్ట్‌కు మళ్లించాలని నిర్ణయం తీసుకుంది.

Read More : Bomb Blast : అదొక చీకటి రోజు, విషాదం జరిగి 14 ఏళ్లు..నిందితులకు శిక్ష అమలయ్యేదెప్పుడు ?

అగరుబత్తీల తయారీ : –
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ. శ్రీవారి భక్తుల సేవే పరమావధిగా వేలాది మంది ఉద్యోగులతో నడుస్తున్న సంస్థ. ప్రసాదాల అమ్మకం, సేవా టిక్కెట్ల విక్రయం, అద్దె గదుల కోటాయింపులో లాభాపేక్షకు అతీతంగా టీటీడీ వ్యవహరిస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం, భక్తుల విరాళాలు దేవస్థానానికి ముఖ్య ఆదాయ వనరులు. అయితే లాభాలు ఆశించకుండా భక్తులకు చేరువయ్యే విభిన్న మార్గాలపైన గత కొంతకాలంగా టీటీడీ దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే అగరుబత్తీల తయారీ, పంచగవ్యాల ఉత్పత్తుల విక్రయానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆలయాలలో వినియోగించే పుష్పాల నుంచి అగరుబత్తీల తయారీ రంగం అంశం టీటీడీని ఆకర్షించింది. అనుకున్నదే తడవుగా ఈ రంగంలోకి అడుగు పెట్టబోతోంది.

Read More : Telangana : వచ్చే 20 ఏళ్లు..అధికారంలో టీఆర్ఎస్

50కి పైగా ఆలయాలు : –
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 50కి పైగా ఆలయాలున్నాయి. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 26 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అలంకరణ కోసం ప్రతి రోజు వెయ్యి కేజీల పుష్పాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల నుంచి ప్రత్యేక పుష్పాలను తెప్పిస్తుంటారు. 11 రకాల పుష్పాలతో స్వామివారికి రెండు పూటలా పుష్పాలంకరణ చేస్తారు. పుష్పకైంకర్యం కోసం ఒక్క శ్రీవారి ఆలయంలోనే నిత్యం 250 కేజీల పుష్పాలను వినియోగిస్తున్నారు.

Read More : Srisailam : శ్రీశైలంలో కొనసాగుతున్న శ్రావణ మాస పూజలు

ఏడు విభిన్న పేర్లతో : –
ఇలా స్వామివారి అలంకరణ తరువాత పుష్పాలన్నీ ఆగమశాస్త్ర బద్దంగా పూల బావిలోనే వేస్తున్నారు. పైగా అది పూర్తిగా నిండిపోవడంతో ప్రత్యామ్నాయంగా గార్డెన్ కార్యాలయం వద్ద మరో పూలబావిని ఏర్పాటు చేశారు. ఇలా వాడిన పూలు ప్రతినిత్యం 500 కేజీల వరకు పోగవుతున్నాయి. వీటి వినియోగంపై దృష్టి సారించిన టీటీడీ.. ఆ పుష్పాలతో పౌడర్‌ను తయారు చేసి భక్తులకు అందిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేసింది. 2012లో ఓ సారి ప్రతిపాదన వచ్చినా.. వివిధ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శన్ కంపెనీతో టీటీడీ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది. సదరు సంస్థకు పుష్పాలను తరలించి ఏడు విభిన్న పేర్లతో అగరుబత్తీలను తయారు చేయించనుంది.