Srivani Online Quota Tickets : శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను శనివారం(ఫిబ్రవరి25,2023) తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

Srivani Online Quota Tickets : శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

Srivani online quota tickets

Srivani Online Quota Tickets : శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను శనివారం(ఫిబ్రవరి25,2023) తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. నిత్యం ఆన్ లైన్ లో 500 చొప్పున టికెట్లు అందుబాటులో ఉంచనుంది. శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.
ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు
పుష్కరణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు స్వామి అమ్మవారు దర్శనమివ్వనున్నారు.తెప్పోత్సవాల్లో మొదటి రోజు మార్చి 3న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా సీతారామచంద్ర స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

Srivari Virtual Service Tickets : తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ

ఇక రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనమివ్వబోతున్నారు. చివరి రోజు తెప్పపై పుష్కరణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల నేపథ్యంలో మార్చి 3, 4 తేదీల్లో తోమాల సేవ, అర్చన, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.

మార్చి 5, 6 తేదీల్లో తోమాల సేవ, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు. ఇక చివరి రోజున మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.