కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కర ఘాట్ల వివరాలు

  • Published By: murthy ,Published On : November 20, 2020 / 03:25 PM IST
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కర ఘాట్ల వివరాలు

Tungabhadra pushkara ghats in Kurnool district : నవంబర్ 20 నుంచి ప్రారంభమైన తుంగభధ్ర పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కర్నూలులోని సంకల్ భాగ్ పుష్కర్ ఘాట్ లో పుష్కరాలను ప్రారంభించారు.

 కర్నూలు అసెంబ్లీ నియోజవర్గం పుష్కర ఘాట్లు….
1. మాసామసీద్ ( పంప్ హౌస్) పుష్కర్ ఘాట్, కర్నూలు టౌన్
2. సంకల్‌భాగ్‌ పుష్కర్ ఘాట్ . కర్నూలు టౌన్
3. నాగసాయి ఆలయం పుష్కర్ ఘాట్, కోత్తపేట కర్నూలు టౌన్
4. రాంబోట్ల ఆలయం పుష్కర్ ఘాట్, కర్నూల్ టౌన్
5. రాఘవేంద్ర మఠం పుష్కర్ ఘాట్, కర్నూలు టౌన్
6. సాయిబాబా ఆలయం పుష్కర్ ఘాట్, కర్నూలు టౌన్
7. నగరేశ్వర స్వామి పుష్కర్ ఘాట్, కర్నూల్ టౌన్



కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు
8. గంగమ్మ పుష్కర్ ఘాట్, గుండ్రేవుల గ్రామం.
9 . సుంకేసుల బ్యారేజ్ పుష్కర్ ఘాట్, సుంకేశుల గ్రామం.
10. గంగమ్మ ఆలయం పుష్కర్ ఘాట్ పంచలింగల గ్రామం.
11. మునగాలపాడు గ్రామం పుష్కర్ ఘాట్ (రోడ్ బ్రిడ్జ్ డౌన్ స్ట్రీమ్)
12. గోందిపర్ల శివాలయం దగ్గర పుష్కర్ ఘాట్.



మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు
13. NAP పంప్ హౌస్ సమీపంలో పుష్కర ఘాట్ మంత్రాలయం మఠం
14. సంత మార్కెట్ దగ్గర పుష్కర మాట్ మంత్రాలయం మఠం
15. వినాయక పుష్కర ఘాట్ మంత్రాలయం
16. రామలింగేశ్వర స్వామి ఆలయం పుష్కర్ ఘాట్. రాంపురం గ్రామం, మంత్రాలయం
17. రామలింగేశ్వర స్వామి ఆలయం పుష్కర్ ఘాట్ . మైలిగనూర్ గ్రామం, కౌతాళం
18. రైల్వే బ్రిడ్జి సమీపంలో పుష్కర్ ఘాట్, కాచపురం గ్రామం , మంత్రాలయం
19. VVIP – I పుష్కర్ ఘాట్,(మఠం వెనుక వైపు) రాఘవేంద్ర స్వామి ఆలయం, మంత్రాలయం
20. VVIP – II పుష్కర్ ఘాట్ , (మఠం వెనుక వైపు) రాఘవేంద్ర స్వామి ఆలయం, మంత్రాలయం



ఎమ్మిగనూర్ అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు
21. నాగులదిన్నె వంతెన సమీపంలో పుష్కర్ ఘాట్, నాగులదిన్నె గ్రామం, నందవరం మండలం
22. రామలింగేశ్వర ఆలయం వద్ద పుష్కర్ ఘాట్, గురుజాల గ్రామం, నందవరం మండలం



నందికోట్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు
23 . సంగమేశ్వరం వద్ద పుష్కర్‌ఘాట్ – కొత్తపల్లి



తుంగభద్ర పుష్కరాల సంధర్బంగా కర్నూలు పట్టణంలో పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్ధలాలు…..
1)పంప్ హౌస్ పుష్కర్ ఘాట్ కు వెళ్ళు వారు. సంజీవని హాస్పిటల్ ప్రక్కన మరియు వసంత రెసిడెన్సి ప్రక్కన పొలాలలో వాహనాలు పార్కింగ్ చేయాలి. VIP ల వాహనాలను ఘాట్ కు కుడి ప్రక్కన వాహనాలను పార్కింగ్ చేయాలి.
2)మునగాలపాడు దగ్గర పుష్కర ఘాట్ కు వెళ్ళేవారు…తిప్పమ్మ కొట్టం దగ్గర పార్కింగ్ చేయాలి.
3) నాగసాయి టెంపుల్ పుష్కర ఘాట్, సాయిబాబా టెంపుల్ పుష్కర ఘాట్లకు వెళ్ళేవారు….ఓల్డ్ సాయిబాబా టాకీసు దగ్గర వాహనాలను పార్గింగ్ చేయాలి.
4) సంకల్ భాగ్ పుష్కర ఘాట్ కు వెళ్ళే వారు…STBC కళాశాలలో వావాహనాలను పార్కింగ్ చేయాలి.
5)నగరేశ్వర పుష్కర ఘాట్ , రాఘవేంధ్ర మఠం ఘాట్, రాంబోట్ల పుష్కర ఘాట్లకు వెళ్ళేవారు. మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాహనాలను పార్కింగ్ చేయవలెను. రాంబోట్ల పుష్కర ఘాట్ కు వచ్చే టూ వీలర్స్ లను జమ్మిచెట్టు వద్ద పార్కింగ్ చేయవలెను.