ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ లైంగిక వేధింపుల వివాదంలో ట్విస్ట్

టీటీడీలో ప్రకంపనలు రేపిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ లైంగిక వేధింపుల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 04:00 PM IST
ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ లైంగిక వేధింపుల వివాదంలో ట్విస్ట్

టీటీడీలో ప్రకంపనలు రేపిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ లైంగిక వేధింపుల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం

టీటీడీలో ప్రకంపనలు రేపిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ లైంగిక వేధింపుల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఆడియోలో మాట్లాడిన మహిళా ఉద్యోగిని ముఖం చాటేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకున్నారు. ఫోన్ ఆడియోతో చట్టపరమైన చర్యలు సాధ్యం కాదని అంటున్నారు. బాదితులు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. కాగా, ఎస్వీబీసీ చైర్మన్ గా కొత్త వ్యక్తిని నియమించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. 

పృథ్వీ రాజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో పృథ్వీకి జరిగిన సంభాషణ బయటకు వచ్చింది. రొమాంటిక్ గా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు కలకలం రేపాయి. ఆ ఆడియో టేప్ ప్రకారం.. అన్నం తినేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదా..? అని పృథ్వీ ఆ మహిళతో అన్నారు.

మార్చి వరకు మద్యం తాగనన్న పృథ్వీ.. డ్రింక్ చేయడం మొదలుపెడితే.. నీ దగ్గర కూర్చొని మొదలుపెడతానన్నారు. నువ్వు గుండెల్లో ఉన్నావ్ అని పృథ్వీ అనగా… ఆ మాట మీరు భలే చెప్తారు సార్ అని ఆ మహిళ బదులిచ్చింది. కామెడీలు చేయకు.. నిజంగా చెబుతున్నా.. వెనుక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుందామని అనుకున్నా. కానీ కెవ్వుమని అరుస్తామని ఆగిపోయానని పృథ్వీ మాట్లాడుతున్నట్టుగా ఆ ఆడియో టేప్‌‌లో ఉంది. నువ్వంటే నాకిష్టం లవ్ యూ అన్న మాటలు కూడా అందులో ఉన్నాయి.

జీతం పెంచుతానని, జాబ్ పర్మినెంట్ చేస్తానని చెప్పి పృథ్వీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. పృథ్వీ అక్రమాలకు పాల్పడ్డారని, ఎలాంటి అర్హత లేకున్నా పలువురిని ఎస్వీబీసీ ఉద్యోగులుగా తీసుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పంపారు. అయితే ఇప్పటివరకు వేధింపులపై ఎటువంటి కేసు నమోదు కాకపోవడం విశేషం.

తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన పృథ్వీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తనను ఇరికించేందుకు కుట్ర జరిగిందన్నారు. విచారణలో క్లీన్ చిట్ వచ్చాక తిరిగి బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దీంతో.. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఏ మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read : మహిళా ఉద్యోగితో ఫోన్‌లో సరసాలు: అడ్డంగా బుక్కైన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ