Road Accident : ప్రాజెక్టును చూస్తుండగా మహిళల పైనుంచి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. ప్రాజెక్టును చూస్తుండగా ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం కాల్వపల్లి దగ్గర పేరూరు ప్రాజెక్టును చూసేందుకు మహిళలు వెళ్లారు.

Road Accident : ప్రాజెక్టును చూస్తుండగా మహిళల పైనుంచి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు మృతి
ad

road accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. ప్రాజెక్టును చూస్తుండగా ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం కాల్వపల్లి దగ్గర పేరూరు ప్రాజెక్టును చూసేందుకు మహిళలు వెళ్లారు.

ఇద్దరు మహిళలు ప్రాజెక్టును చూస్తుండగా అటుగా వచ్చిన లారీ వారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయిపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. వారి అవయవాలు ఛిద్రమైపోయాయి. అయితే, ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు లారీని వెంబడించారు.

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పోలీసులు మృతి

బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య లారీ డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు లక్ష్మీదేవి, సరస్వతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.