Ugadi Celebration 2023: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా.. సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నివాసం గోశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.

AP CM Jagan's couple participated in Ugadi celebrations
Ugadi Celebration 2023: శ్రీ శోభకృత్ నామ (Sri Sobhakritu Nama) సంవత్సర ఉగాది పండుగ (Ugadi Festival)ను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది పచ్చడి సేవించి తెలుగువారి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాల్లో పండితులు పంచాగ శ్రవణా (Panchaga Shravanam)లు వినిపిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలకు ముందు శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.

AP CM Jagan’s couple participated in Ugadi celebrations
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు కలిగించాలని జగన్ ఆకాంక్షించారు. రైతులకు, అక్కచెల్లెమ్మలు, సకల వృత్తుల వారికి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మంచి జరగాలని, తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ తెలిపారు. అనంతరం సోమయాజి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా జగన్ సోమయాజిని సన్మానించారు.

AP CM Jagan’s couple participated in Ugadi celebrations
Ugadi 2023 : షడ్రుచుల సమ్మేళనం .. ఉగాది పచ్చడితో ఆరోగ్యం
తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు సీఎం జగన్‌మోహన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. ఈ వేడుకల్లో మంత్రి రోజా, వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.