యూకే టు ఏపీ : వచ్చిన వారు 1363, 11 మందికి కరోనా ?

యూకే టు ఏపీ : వచ్చిన వారు 1363, 11 మందికి కరోనా ?

UK returnees in AP test Covid-19 positive : యూకేలో కొత్త రకం కరోనా స్ట్రైయిన్ భయకంపితులను చేస్తోంది. ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకముందే..మరో వైరస్ వ్యాపిస్తుండడం అందర్నీ కలవరపెడుతోంది. యూకే నుంచి వచ్చిన వారు వివిధ దేశాలకు వెళుతుండడంతో అధికారులు అలర్ట్ అయిపోయారు. పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. భారతదేశంలో అడుగు పెట్టిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా..యూకే నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చారనే సంగతి తెలియడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

యూకే నుంచి ఏపీకి వచ్చిన వారు 1363గా తేలింది. ఇందులో 1346 మందిని గుర్తించినట్లు, 1324 మంది క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే..ఇంకా 17 మంది ఎక్కడున్నారో తెలియడం లేదని తెలుస్తోంది. 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.  అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు, ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారు ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన వారు నలుగురు శాంపిల్స్ తీసుకుని పూణె ల్యాబ్‌కు పంపించడం జరిగిందని తెలిపారు.

కొత్త స్ట్రైయిన్ లక్షణాలు ఉన్నాయా ? అనేది తెలియరాలేదు. వీరి ద్వారా 5784 మందిని ట్రేస్ చేసినట్లు, వీరి శాంపిల్స్ కూడా పంపించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన 8 మంది నుంచి 12 మందిని కలిసినట్లు, ఇలా గుంటూరులో 8 మంది, నెల్లూరు జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరిలో ముగ్గురిని గుర్తించినట్లు వెల్లడించారు.