Ukraine Crisis : విద్యార్థులను తీసుకొచ్చేందుకు పూర్తి చర్యలు – ఏపీ ప్రత్యేక ప్రతినిధి

ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు చేయడం జరుగుతోందన్నారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని తీసుకొచ్చే..

Ukraine Crisis : విద్యార్థులను తీసుకొచ్చేందుకు పూర్తి చర్యలు – ఏపీ ప్రత్యేక ప్రతినిధి

Ap Representative

AP Representative Pandugayala Ratnakar : ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ విపత్కర పరిస్థితిలో ఉన్నా సహాయం చేయడంలో సీఎం జగన్ ముందు ఉంటారని నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ పొరుగున ఉన్న 4 దేశాలకు ప్రత్యేక ప్రతినిధులను ప్రభుత్వం నియమించిందనే విషయాన్ని గుర్తు చేశారు. స్లోవేకియాకు తనను ప్రతినిధిగా పంపుతున్నారని, ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులను తీసుకురావడంలో కృషి చెస్తామన్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి సరిహద్దుకు తీసుకురావడం, అక్కడి నుంచి ఇండియాకు తీసుకొస్తామన్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

Read More : Ukraine Russia War : యుక్రెయిన్‌లో బందీలుగా భారత విద్యార్థులు.. కేంద్ర విదేశాంగ శాఖ వివరణ..!

ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు చేయడం జరుగుతోందన్నారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని తీసుకొచ్చే విషయంలో ప్రత్యేక ప్రతినిధులుగా తాము పూర్తిగా నిమగ్నమవుతామన్నారు. పూర్తిగా విద్యార్థులను ఏపీకి చేర్చే వరకు కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశించడం జరిగిందన్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యుక్రెయిన్‌లో యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

Read More : AP Students in Ukraine : ఏపీ విద్యార్థుల కోసం యుక్రెయిన్ సరిహద్దులకు ప్రతినిధుల బృందం..!

యుక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లొవేకియాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. హంగేరీ దేశానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఏపీ ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు మేడపాటి ఎస్‌.వెంకట్, పోలాండ్ యూరప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రారెడ్డి, రొమేనియాకు ప్రవాసాంధ్రుల ప్రభుత్వ ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను పంపనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులను జారీ చేశారు.