తిరుపతి ఉప పోరులో బీజేపీకి అనుకోని షాక్‌..

తిరుపతి ఉప పోరులో.. బీజేపీకి అనుకోని షాక్‌ తగిలింది. గెలుపు కోసం బీజేపీ - జనసేన కూటమి సర్వ శక్తులనూ ధారపోస్తుండగా ఇప్పుడు అనుకోని చిక్కొకటి అడ్డొచ్చి పడింది.

తిరుపతి ఉప పోరులో బీజేపీకి అనుకోని షాక్‌..

Bjp

Unexpected shock to BJP : తిరుపతి ఉప పోరులో.. బీజేపీకి అనుకోని షాక్‌ తగిలింది. గెలుపు కోసం బీజేపీ – జనసేన కూటమి సర్వ శక్తులనూ ధారపోస్తుండగా ఇప్పుడు అనుకోని చిక్కొకటి అడ్డొచ్చి పడింది. బై పోల్‌ బరిలో కూటమికి వచ్చిన చిక్కేంటి..? ఉమ్మడి నేతలకు తగిలిన షాక్‌ ఏంటి..?

తిరుపతి బైపోల్‌ను సీరియస్‌గా తీసుకున్నాయి బీజేపీ, జనసేన పార్టీలు. పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ఎలాగైనా గెలవాలని ఆ రెండు పార్టీలు తమ శక్తినంతటినీ ధారపోస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ నేతలు సైతం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారంటే.. ఆ పార్టీలు బైపోల్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఉమ్మడి కూటమికి షాక్‌ తగిలింది. కరోనా రూపంలో ఆ రెండు పార్టీలను ఆ షాక్‌ టెన్షన్‌ పెడుతోంది.

ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఉప ఎన్నికకు ముందు.. నాయుడుపేటలో మహా సభకు ప్లాన్‌ చేశాయి బీజేపీ-జనసేన పార్టీలు. ఇవాళ జరిగే ఈ ప్రచార సభలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనాని పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేసి.. భారీగా ఓట్లు కొల్లగొట్టేయాలని ప్లాన్‌ చేసిందా కూటమి.

అయితే.. కరోనా రూపంలో ఆ రెండు పార్టీలకు షాక్‌ తగిలింది. పవన్‌ కల్యాణ్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లి పోవడంతో.. కమలం శ్రేణులు కాస్త డీలా పడ్డాయి. పవన్‌ భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో కొంతమంది కరోనా బారిన పడ్డారు. దీంతో.. డాక్టర్ల సలహా మేరకు పవన్ కల్యాణ్ సెల్ఫ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

పవన్‌ను సమీపంగా ఉండే వారిలో గత వారం పది రోజులుగా ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు జనసేన అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. అయితే ఇవాళ జరిగే సభకు పవన్‌ హాజరుకాకపోయినా.. వర్చువల్‌గా ప్రచారం చేస్తారంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ప్రచారంలో ఊపుమీద వెళ్తున్న బీజేపీ-జనసేన కూటమికి.. పవన్‌ ఇలా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవడం.. ప్రచారానికి రాకపోవడం మైనస్సేనంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ పరిస్థితి నుంచి వాళ్లు ఎలా గట్టెక్కుతారనేది చూడాలి మరి.