‘పోలవరం’కు లైన్‌ క్లియర్‌…రూ. 48వేల కోట్లు భరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 06:13 AM IST
‘పోలవరం’కు లైన్‌ క్లియర్‌…రూ. 48వేల కోట్లు భరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా… 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 

పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా… 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై ఇప్పటికే 16 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం… మిగతా 32 వేల కోట్లనూ భరించేందుకు పచ్చ జెండా ఊపింది. అలాగే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి ఉన్న  2వేల 200 కోట్ల నిధులు ఆడిటింగ్‌ పూర్తి కాగానే విడుదల కానున్నాయి.

భూసేకరణ, పునరావాస వ్యయం భరించనున్న కేంద్రం
పోలవరం ప్రాజెక్టు పూర్తికి లైన్‌ క్లియర్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. నరేంద్రమోడీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు భారీ వరాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కూడా భరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ మీద ఇన్నాళ్లూ క్లారిటీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన గుదిబండ పడేది. ఇక నుంచి భూసేకరణ, పునరావాసానికి కూడా నిధులను కేంద్రమే భరించనుంది.  

Also Read : రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు 

ప్రాజెక్టు అంచనావ్యయం 55వేల 545 కోట్లు
పోలవరం ప్రాజెక్టు అంచనావ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 55వేల 545 కోట్లుకు సవరించింది. అయితే, అందులో 48వేల కోట్లు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సుమారు 16వేల కోట్లు ఖర్చు చేసింది. తాజాగా సవరించిన అంచనాలు, కేంద్రం ఆమోదం తెలిపిన ప్రకారం మరో 32వేల కోట్లు కూడా కేంద్రమే భరించనుంది. అందులో భూసేకరణ, పునరావాల పనులకు 27వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరో 5వేల కోట్లు ప్రాజెక్టు ఇంజినీరింగ్ కోసం ఖర్చు అవుతుంది. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏడువేల కోట్లు భరించాల్సి ఉంటుంది.

నిర్మలాసీతారామన్‌తో బుగ్గన భేటీ
ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. పోలవరం నిధులను విడుదల చేయాలని కోరారు. అంతేకాదు… రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని విన్నవించారు. 5 వేల కోట్ల గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్లు ఖర్చు చేసిందన్న ఆయన… వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రులను కోరామన్నారు. 

Also Read : BECIL లో 4 వేల ఉద్యోగాలు: దరఖాస్తు గడువు పొడిగింపు

2021కి పోలవరం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ టార్గెట్‌
పోలవరం ప్రాజెక్టును 2021 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌  ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం పనులు త్వరితగతిన సాగుతున్నా… నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ విషయంపై మాత్రమే స్పష్టత లేదు. ఇప్పుడు ఆర్థికశాఖ ఆమోదం తెలుపడంతో కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే మిగిలింది. కేంద్ర కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపితే.. పోలవరం నిజంగా ఏపీకి వరంగా మారుతుంది. మొత్తానికి బుగ్గన ఢిల్లీ యాత్ర ఫలించినట్టుగా తెలుస్తోంది.