మాజీ ఇంటెలిజెన్స్‌‌చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్, సస్పెన్షన్‌ను సమర్థించిన కేంద్రం

మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 11:18 AM IST
మాజీ ఇంటెలిజెన్స్‌‌చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్, సస్పెన్షన్‌ను సమర్థించిన కేంద్రం

మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.

మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కేంద్రం సమర్థించింది. 

ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఏబీవెంకటేశ్వరరావు తప్పిదాలకు పాల్పడినట్టుగా ప్రాథమిక ఆధారాలు లభ్యం అయ్యాయని తెలిపింది. ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు అందాయని చెప్పింది. 

ఏబీ వెంకటేశ్వరరావుపై ఛార్జిషీట్‌ దాఖలు చేయమని కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శనివారం (మార్చి7, 2020) ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాసింది. ఎప్రిల్ 7 లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో హోంశాఖ పేర్కొంది. 

 ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావు అక్రమాలపై సమగ్ర నివేదికను ఫిబ్రవరి 19, 2020న కేంద్ర హోంశాఖకు నివేదించింది. వెంకటేశ్వరరావు అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నందున అతడ్ని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఖరారు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు ఏరోసాట్‌ సహా, అన్‌ మేన్డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌(యూఏవీ) కోసం వెచ్చించిన రూ.25.5 కోట్ల  కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపి… వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేయమని కేంద్రాన్ని కోరింది. 

ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ కొనుగోళ్లలో వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు కేంద్రం నిర్ధారించుకుంది. దీంతో వెంకటేశ్వరావుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. ఏప్రిల్‌ 07 2020 లోగా వెంకటేశ్వరావుపై ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని కేంద్రం.. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

పోలీసు శాఖ ఆధునీకరణ పేరుతో ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై ఏసీబీతో సమగ్ర విచారణ చేయించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే వెంకటేశ్వరరావు సస్పెన్షన్ లో ఉన్నారు.

తాను ఏ రకమైన అక్రమాలకు పాల్పడలేదని, కొనుగోలు చేయలేదని ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఏసీబీతో సమగ్ర విచారణ చేయించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీనిపై ఛార్జీషీట్ కూడా దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా లేఖ రాసింది. 

See Also | తెలంగాణలో కరోనా లేదు…నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లు ఖర్చు : సీఎం కేసీఆర్