Bhagwanth Khuba : ఏపీలో టీడీపీతో పొత్తుపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీలో గత కొంతకాలం నుంచి ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై కూడా చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటనతో ఎన్నికల వేడి మరింత పెరిగింది టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి ఏపీ ఎన్నికల పొత్తులతో పాటు ఏపీ పాలన గురించి వ్యాఖ్యానించారు.

Bhagwanth Khuba : ఏపీలో టీడీపీతో పొత్తుపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

Union Minister Bhagwanth Khuba

Minister Bhagwanth Khuba : ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎన్నికల హీట్ పీక్స్ కు చేరుకుంటోంది.  ఏపీలో గత కొంతకాలం నుంచి ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై కూడా చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. పొత్తులు అంటే ముఖ్యంగా వార్తల్లోకొచ్చేది. జనసేన, టీడీపీ, బీజేపీలు. ఈ క్రమంలో కేంద్రమంత్రి భగవత్ ఖూబా తాజాగా ఏపీ ఎన్నికల పొత్తులతో పాటు ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు గురించి మాట్లాడారు.

కర్ణాటకలో తాము ఓడిపోయినా గతం కంటే తమ ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఏపీ విషయానికొస్తే జనసేనతో తమ పొత్తు ఉందని.. ఇక టీడీపీతో పొత్తు విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయిందని.. పురోగతి లేక అప్పుల ఆంధ్రాగా మారిపోయిందని అన్నారు. ఏపీ రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వైఖరి ఏమాత్రం సరిగాలేదని విమర్శించారు కేంద్ర మంత్రి భగవత్ ఖుబా.

కాగా.. ఏపీలో జనసేన, టీడీపీ పొత్తులు ఖాయం అనేలా ఉంది. సీఎం పదవి కాదు వైసీపీని ఓడించటమే మా ప్రధాన లక్ష్యం అని జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. దాని కోసం ఏదైనా చేస్తామని అంటున్నారు పవన్ కల్యాణ్.  వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటమీదనే నిలబడ్డ పవన్ టీడీపీతో పొత్తు దాదాపు ఖాయం అన్నట్లుగానే ఉంది పరిణామాలు చూస్తుంటే. ఈ ఇరు పార్టీలతో పాటు బీజేపీ కూడా ఒక్కటైతే ఇక వైసీపీ ఓటమి ఖాయం అంటున్నాయి పలు సర్వేలు. ఇక వైసీపీ మాకు ఎవరితోను పొత్తు అసవరం లేదు ఒంటరిగానే పోటీ అని చెబుతోంది.

కానీ టీడీపీతో పొత్తు విషయంలో ఏపీ బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోంది. టీడీపీతో పొత్తులో ఉంటే జనసేనతో ఉండబోమని అంటున్నారు ఏపీలో కొందరు బీజేపీ నేతలు. కేంద్ర బీజేపీ మాత్రం దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ కేంద్ర బీజేపీ పెద్దలను ఒప్పించి పొత్తులతోనే వైసీపీని ఓడించి తీరుతామని జనసేనాని పవన్ అంటున్నారు. ఆ దిశగా బీజేపీ అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పొత్తుల గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది.