Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు

విశాఖలో పెళ్లిపీటల మీదే కుప్పకూలిన సృజన, మహబూబ్‌నగర్ జిల్లాలో పెళ్లి అలా ముగిసిందో లేదో ఇలా ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి...కామారెడ్డి జిల్లాలో పెళ్లయిన మూడు నెలలకే ఇంటి నుంచి వెళ్లిపోయిన నవవధువు యమున ఉదంతాలే ఇందుకు సాక్ష్యం.

Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు

Girls

Unwilling marriages : అప్పుడే పెళ్లి.. అంతలోనే పెళ్లి కూతుళ్ల మృతి. ఇదీ కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. వేల ఆశలతో.. అత్తవారింట అడుగు పెట్టాల్సిన యువతులు.. ఎందుకు చనిపోతున్నారు? పెళ్లి ఇష్టం లేదని కన్నవారికి ధైర్యంగా చెప్పలేక పోతున్నారా? లేక చెప్పినా.. కన్నవారే బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? కాళ్ల పారాణి ఆరకముందే అమ్మాయిలు విగతజీవులుగా మారడానికి కారకులెవరు? విశాఖ, మహబూబ్‌నగర్ ఘటనలు ఏం చెబుతున్నాయి?

వేల ఆశలు…వందల కలలతో వివాహజీవితం కోసం ఎదురుచూస్తుంటారు యువతులు. వధువుగా మారే క్షణం అమ్మాయి జీవితంలో అత్యంత అపురూపం. కోరుకున్నవాడితో మూడుముళ్లు వేయించుకుని…జీవితాంతం సంతోషంగా కలిసి జీవించాలన్న ఆశ అమ్మాయిది. కానీ కలలు నెరవేరడం లేదు….అల్లుకున్న ఆశలు తీరే మార్గం కనిపించడం లేదు…అని తెలిసిన క్షణం…వారి సుతిమెత్తని మనసు మాట వినదు.

Bride Suicide : ఉదయం పెళ్లి.. అప్పగింతల సమయంలో పురుగులమందు తాగి నవ వధువు ఆత్మహత్య

పెద్దల ఆస్తుల లెక్కలు, పరువుప్రతిష్టల సమీకరణాలు ప్రేమించిన మనసుకు అర్ధం కావు. ఇప్పుడు పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం…ప్రేమించిన వాణ్ని పెళ్లిచేసుకోలేకపోవడం….ఇష్టం లేని వ్యక్తితో తాళికట్టించుకోవాల్సిరావడం…అమ్మాయిలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. ఇష్టం లేని పెళ్లిచేసుకోవాల్సిన పరిస్థితుల్లో … వారికి చావే శరణ్యమవుతోంది. కొత్త జీవితం కల్పించాల్సిన పెళ్లే నవవధువులను బలితీసుకుంటోంది.

విశాఖలో పెళ్లిపీటల మీదే కుప్పకూలిన సృజన, మహబూబ్‌నగర్ జిల్లాలో పెళ్లి అలా ముగిసిందో లేదో ఇలా ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి…కామారెడ్డి జిల్లాలో పెళ్లయిన మూడు నెలలకే ఇంటి నుంచి వెళ్లిపోయిన నవవధువు యమున ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. సరిగ్గా ముహూర్తానికి తలపై జీలకర్ర, బెల్లం పెట్టే ముందు సృజన ఎందుకు కుప్పకూలిందో….పెళ్లిలో భర్తతో కలిసి ఏడడుగులు నడిచిన లక్ష్మి..అత్తారింటికి వెళ్లకముందే బలవన్మరణానికి ఎందుకు పాల్పడిందో…వివాహం జరిగి మూడు నెలలు కాకముందే…ఇంటి నుంచి వెళ్లిపోయేంత కష్టం యమునకు ఎందుకొచ్చిందో…తల్లిదండ్రులు…కుటుంబసభ్యులే ఆలోచించుకోవాలి.

Kurnool : దారుణం.. పెళ్లి చేసుకుందని కూతురిపై కత్తితో తండ్రి దాడి

తమ మనసు చంపుకోలేక, పెద్దల ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోలేక…అమ్మాయిలు తమను తాము బలిచేసుకుంటున్నారు. అర్ధం చేసుకోలేని పెద్దలు..మనసు మార్చుకోలేని పరిస్థితులతో రాజీపడలేక విషాదాంతంగా జీవితాలను ముగించుకుంటున్నారు. కోటికలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అమ్మాయిలు….వధువుల హోదాలో పెళ్లిపీటల మీద నుంచే..ఆఖరి ప్రయాణం చేస్తున్నారు.