చెంచుల గూడెంలో మేకపిల్లలతో ఉపాసన..అడవిబిడ్డల ఆహారపు అలవాట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు

10TV Telugu News

ఉపాసన కొణిదెల. పరిచయం అక్కరలేని మహిళ అంటూ ప్రతీసారి చెప్పుకుంటాం. బిజీ షెడ్యూల్ లో ఉండే ఉపాసన చాలా చక్కటి మెజేజ్ లు ఇస్తుంటారు. అటువంటి ఉపాసన చక్కటి సామాజిక బాధ్యతలను కూడా పోషిస్తుంటారు. ఆమె కొన్ని రోజుల క్రితం లాక్ డౌన్ సందర్భంగా  శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు రెండు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె తన టీమ్ తో కలిసి నల్లమల అటవీప్రాంతాల్లోని చెంచు గూడేలల్లో పర్యటించారు. అక్కడి ప్రజల సంస్కృతి, వారి జీవన విధానాన్ని ఉపాసన చాలా ఆసక్తికగా పరిశీలించారు. వారితో సరదాసరదాగా గడిపారు. రెండు బుజ్జి మేకపిల్లలను ఎత్తుకుని ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఫోటోలతో పాటు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ బుజ్జి మేకలు ఎంత ముద్దుగా ఉన్నాయో..ఈ పిల్లలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా  మారిపోతాయేమో అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లను, వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం, గౌరవించడం ఇటువంటి పర్యటనల ద్వారా నేర్చుకుంటున్నానని చాలా సమన్వయంతో మాట్లాడుతూ తెలిపారు. ఈ చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం. వారంతా ప్రకృతిలో అలరారే బిడ్డలు అంటూ కొనియాడారు.

కానీ..మన నమ్మకాలు, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇది తగిన సమయం కాదు. మాంసం తినండి.. కానీ మితంగా తినండి. ఈ వనరులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలుసుకుని మనమంతా మసలుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారం తీసుకుందాం… నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం” అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read: Google Mapsలో అమితాబ్ వాయిస్ ?

×