Anantapur: అనంతపురంలో ఉత్తుత్తి బ్యాంక్.. నకిలీ బ్యాంక్ ఏర్పాటు చేసి లక్షల్లో వసూలు

అనంతపురంలో నకిలీ బ్యాంక్ ముఠా గుట్టు రట్టైంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి మోసానికి పాల్పడ్డారు. డిపాజిటర్ల నుంచి లక్షల్లో వసూలు చేశారు.

Anantapur: అనంతపురంలో ఉత్తుత్తి బ్యాంక్.. నకిలీ బ్యాంక్ ఏర్పాటు చేసి లక్షల్లో వసూలు

Anantapur: ఏపీ, అనంతపురంలో బ్యాంక్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ ముఠా వ్యవహారం బయటపడింది. నకిలీ బ్యాంక్ పేరుతో మోసానికి పాల్పడింది ఒక కుటుంబం. స్థానిక తపోవనం సర్కిల్‌లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కలిసి, ఎల్‌డీఆర్‌కే నిధి ప్రైవేట్ లిమిటెడ్‌ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

BiggBoss 6 Launching Episode : గత సీజన్లతో పోలిస్తే దారుణంగా పడిపోయిన బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ రేటింగ్.. దానివల్లేనా?

కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. తర్వాత తక్కువ వడ్డీకే రుణాలిస్తామని నమ్మించారు. దాదాపు 2,123 మంది నుంచి లక్షల రూపాయల వసూలు చేసి డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ సంస్థ ద్వారా నిర్వాహకులు డిపాజిటర్లనే కాకుండా, ఏజెంట్లను కూడా మోసం చేశారు. ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంకుకు చెందిన మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Pak PM Headphone falling : హెడ్‌ఫోన్ పెట్టుకోవటానికి పాక్ ప్ర‌ధాని తిప్పలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ న‌వ్వులు..

అనంతపురం, నాలుగవ పట్టణ సీఐ జాకీర్ హుసేన్ మాట్లాడుతూ… ఈ సంస్థ వంద మంది ఏజెంట్లను కూడా మోసం చేసిందన్నారు. బ్యాంకుకు చెందిన నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మోసానికి సంబంధించిన పూర్తి లెక్కలు తెలియాల్సి ఉంది.