Job Vacancies : ఏపిలోని వైఎస్సార్ జిల్లాలో వైద్యఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఖాళీల ఆధారంగా పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపి చేస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Job Vacancies :  ఏపిలోని వైఎస్సార్ జిల్లాలో వైద్యఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ

Vacancies in Medical and Health Department

Job Vacancies : ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలను కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి బయో మెడికల్ ఇంజినీర్ 1ఖాళీ, డైటీషియన్ 1, ఫిజియోథెరపిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 16, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II 13,ఈసీజీ టెక్నీషియన్ 2, డెంటల్ టెక్నీషియన్ 1, ఎలక్ట్రీషియన్ 1, ల్యాబ్ అటెండెంట్ 6, జనరల్ డ్యూటీ అటెండెంట్లు 22 ప్లంబర్ 4, ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ 7, శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్2 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఖాళీల ఆధారంగా పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపి చేస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను, సంబంధిత సర్టిఫికెట్స్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్‌ఆర్‌ జిల్లా అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 20 ఆగస్టు 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://kadapa.ap.gov.in/పరిశీలించగలరు.