Vaccination : ఏపీలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్.. నేడు, రేపు బంద్.. కారణం ఇదే

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇవాళ, రేపు.. తాత్కాలికంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Vaccination : ఏపీలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్.. నేడు, రేపు బంద్.. కారణం ఇదే

Vaccination

Vaccination : ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇవాళ, రేపు.. తాత్కాలికంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట కారణంగా బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ ను నిలిపివేశామని ప్రకటించింది ప్రభుత్వం. త్వరలోనే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైమ్ కి టీకా ఇస్తారనే సమాచారాన్ని స్లిప్పుల ద్వారా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఎల్లుండి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన తర్వాత రెండో డోస్ వారికి మాత్రమే వేస్తామని వైద్య సిబ్బంది అంటున్నారు. రెండో డోసు పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ వేయనున్నారు.

క‌రోనా టీకాల కోసం ప్ర‌జ‌లు భారీగా బుకింగ్ చేసుకుంటున్నారు. మొద‌ట వ్యాక్సిన్ అంటేనే భ‌య‌ప‌డ్డ జ‌నం ఇప్పుడు వాటి కోసం వ్యాక్సిన్ కేంద్రాల‌కు తరలి వస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ కొర‌త ఏర్ప‌డ్డ నేప‌థ్యంలో డిమాండుకు త‌గ్గ టీకాల‌ను వేయ‌లేక‌పోతున్నారు.