Vallabhaneni Vamsi: తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. పంజాబ్‌లోని ఆస్పత్రిలో చికిత్స..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది.

Vallabhaneni Vamsi: తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. పంజాబ్‌లోని ఆస్పత్రిలో చికిత్స..

Vallabanini Vamsi

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది.

Vallabhaneni Vamsi Vangaveeti Radha : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ, వంగవీటి రాధ మధ్య ఏకాంత చర్చలు

ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా వల్లభనేని వంశీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రస్తుతం వైసీపీ సానుభూతిపరుడిగా వంశీ కొనసాగుతున్నారు. ఆయన ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యాంపస్ లో ఆఫ్ లైన్ తరగతులకు వెళ్తున్నారు.

Agneepath scheme: అగ్నివీరులకు హరియాణా సర్కార్ గుడ్ న్యూస్..

ప్రస్తుతం మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగడంతో వెంటనే మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడి వైద్యులు వంశీకి పలు పరీక్షలు నిర్వహించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చూసించారు. అయితే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.