Vallabhaneni Vamsi Casino : చంద్రబాబు.. మళ్లీ గుక్కపెట్టి ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడా? వంశీ

సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..

Vallabhaneni Vamsi Casino : చంద్రబాబు.. మళ్లీ గుక్కపెట్టి ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడా? వంశీ

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi Casino : గుడివాడ కాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కాసినో మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సై అంటే సై అంటున్నారు వైసీపీ, టీడీపీ నాయకులు. తేల్చుకుందాం రా, కొట్టుకుందాం రా.. అని సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. మంత్రి కొడాలి నానిని టీడీపీ టార్గెట్ చేసింది. కొడాలి నాని గుడివాడను
గోవాలాగా మార్చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు.. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

AP PRC Strike : సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు

తాజాగా కాసినో వ్యవహారంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయని, అది చాలా కామన్ అన్నట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయని వివరించారు. అయితే, టీడీపీ కావాలని రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి అక్కడ జరిగాయని, వాటి నిర్వాహకులు టీడీపీకి చెందిన వారే అని, కొడాలి నానికి సంబంధం ఏంటి? అని వంశీ ప్రశ్నించారు.

కొడాలి నానికి కరోనా వచ్చి హైదరాబాద్ హాస్పిటల్ చికిత్స పొందుతుంటే.. ఆయనకి అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో నేను టీడీపీలో ఉండగా ఇంతకు మించి ఎక్కువ జరిగాయన్నారు వంశీ. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ కొందరు కలిసి మూడు రోజుల కార్యక్రమాలు చేస్తుంటారని ఆయన వివరించారు. వందల ఏళ్ల నుండి నడుస్తున్న సంప్రదాయం ఇది, ప్రభుత్వాలు ఎవరున్నా మూడు రోజులు చూసీ చూడనట్టు వదిలేస్తాయని
చెప్పుకొచ్చారు.

నాపై చంద్రబాబు, లోకేష్ మళ్లీ సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టారని వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. రెండు నెలల క్రితం ఇలా చేసినందుకే.. నేను అన్న ఒక్క మాటకి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు గుక్కపెట్టి ఏడ్చారని వంశీ అన్నారు. అలాంటివి చాలా ఉన్నాయి మళీ ఇంకోటి అనాలా..? మళ్లీ ఏడవడానికి సిద్ధంగా ఉన్నడా? అని వంశీ అడిగారు. తేల్చుకుందాం రా.. అంటూ.. బుద్దా వెంకన్న విసిరిన సవాల్ పైనా వంశీ స్పందించారు. బుద్దా వెంకన్న మొరిగే కుక్క.. కరిచే సీన్ లేదన్నారు వంశీ.

Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?

కాగా.. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌లో కేసినో నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని సంక్రాంతి పండగ సందర్భంగా అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ గుడివాడ పర్యటనకు వెళ్లడం, పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తలకు దారితీసిన విషయం విదితమే.