Vangalapudi Anitha : మహిళలకిచ్చే గౌరవం ఇదేనా? మీ ఇళ్లకొచ్చి చీపురుతో కొడతా-వంగలపూడి అనిత
లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని ఆమె ఆరోపించారు. దాని ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేశారని మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని తాను కోరుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని అనిత అన్నారు. ఒకడు తథాస్తు అంటే, మరొకడు థ్యాంక్యూ ఆంటీ అంటూ ట్రోల్ చేశారని అనిత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె నిలదీశారు.

Vangalapudi Anitha : నారా లోకేశ్ పాదయాత్రలో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత సీఎం జగన్ కు అనుకూలంగా మాట్లాడారని, ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. దీనిపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. అందులో నిజం లేదంది. ఆ వీడియో, ఆ షోకాజ్ నోటీసులు ఫేక్ అని ఇప్పటికే తేల్చి చెప్పింది.
ఇక ఈ వ్యవహారంపై వంగలపూడి అనిత స్వయంగా స్పందించారు. లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని ఆమె ఆరోపించారు. దాని ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేశారని మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని తాను కోరుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని అనిత అన్నారు. ఒకడు తథాస్తు అంటే, మరొకడు థ్యాంక్యూ ఆంటీ అంటూ ట్రోల్ చేశారని అనిత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె నిలదీశారు.(Vangalapudi Anitha)
నేను తెలుగు మహిళ అధ్యక్షురాలిని. ఒక మాజీ ఎమ్మెల్యేని. అంతకుమించి ఒక దళిత బిడ్డని, ఆడపిల్లని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను మాట్లాడిన మాటలను కూడా ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వీళ్లను మనుషులు అనాలా, పశువులు అనాలా?” అని ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత. జగన్ మళ్లీ సీఎం అవ్వాలనుకుంటే చేసిన మంచి పనులను సోషల్ మీడియాలో పెట్టుకోవాలని ఆమె హితవు పలికారు.
” జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెల్సిందే. మహిళా దినోత్సవం సందర్భంగా నాపై జగన్ ఫేక్ ట్రోలింగ్ కి దిగజారారు. నా మాటలను ఎడిట్ చేయడం దారుణం. ఇలా చేసిన వాడి కన్నతల్లి కూడా సిగ్గుపడుద్ది. చేయించిన వాడు ఇంకా సిగ్గు పడాలి. జగన్ సీఎం అవ్వడని తెలిసి ఇలా ఎడిట్ చేసి శునకానందం పొందుతున్నాడు.
ఇది చేసింది ప్రదీప్ అని తెలిసింది. అరేయ్ నీ కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. సోషల్ మీడియా పనికిమాలిన వాళ్ళ సంగతి సరే. నేను నిద్రలో ఉన్న సమయంలో కూడా జగన్ సీఎం అవ్వడం గురించి అనడం జరగదు. నాపై పనికి మాలిన ట్రోలింగ్ చేసిన ఎధవులు నాకు ఫోన్ చేసి బెదిరింపులు. అక్కడితో ఆగకుండా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఫేక్ షోకాజ్ లెటర్ రిలీజ్ చేశారు.(Vangalapudi Anitha)
జగన్ బ్యాచ్ ఇచ్చే 5 రూపాయలకు ఆశపడి ఫేక్ బతుకులు బతుకుతున్నారు. బురదలో బతికే బతుకులు వైసీపీ ఫేక్ బ్యాచ్ వి. ఓ దళిత మహిళకు టీడీపీ ఇచ్చిన గౌరవం. సాక్షి పైనా, ఫేక్ బ్యాచ్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తా. అట్రాసిటీ కేసు పెడతా. మిగతా వారి మాదిరిగా వదలను. మీ నాయకుడు నత్తి పకోడీపై మీ ట్యాలెంట్ చూపించండి. మీ ఇళ్లకొచ్చి చీపురుతో చితకబాదుతా” అని ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత.
అసలేం జరిగిందంటే..
మహిళా దినోత్సవం సందర్భంగా లోకేశ్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత మాట్లాడారు. 2024లో జగన్ ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ ఏకమవ్వాలి అనే ధోరణిలో ఆమె మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అనిత వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.(Vangalapudi Anitha)
ఆ వీడియోలో ఏముందని అంటే.. ”ఎలక్షన్ ఎప్పుడైనా రానివ్వండి. ఏ టైమ్ లో అయినా రానివ్వండి. సంవత్సరం తర్వాత వస్తుందా? సంవత్సరం లోపు వస్తుందా? 6 నెలల్లో వస్తుందా? ఎప్పుడు వస్తుందా? ఎలా వస్తుందా? మనకు అనవసరం. కానీ, జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసే విషయంలో మా మహిళలమందరం కూడా కీలక పాత్ర పోషించబోతున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదే విషయాన్ని మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం అనే సంగతి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటున్నా” అని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉంది.
మరోవైపు యువగళం పాదయాత్రలో సీఎం జగన్ కి ఫేవర్ గా మాట్లాడినందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వంగలపూడి అనితకు షో కాజ్ నోటీసు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ ప్రెస్ నోట్ కూడా వైరల్ అయ్యింది. దీనిపైనా టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రెస్‌నోట్ కూడా ఫేక్ అని తేల్చి చెప్పింది. ఇది వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ అని మండిపడింది. వైసీపీది నీచమైన రాజకీయం అని విరుచుకుపడింది.
★ జగన్ ను సీఎం చేస్తాం అంటున్న టీడీపీ వంగలపూడి అనిత ???♂️ #TDP #EndOfTDP pic.twitter.com/9DL5Ne2wuA
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) March 8, 2023