Srikakulam : కూరగాయలు అంటేనే..సిక్కోలు ప్రజలు హడలిపోతున్నారు..ఎందుకు ?

తుపాను ప్రభావంతో ఓ వైపు పంటలు నష్టపోతుంటే మరోవైపు ఉత్తరాంధ్రలో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. శ్రీకాకుళం ప్రజలు కూరగాయల పేరు చెబితేనే హడలిపోతున్నారు.

Srikakulam : కూరగాయలు అంటేనే..సిక్కోలు ప్రజలు హడలిపోతున్నారు..ఎందుకు ?

Veg

Vegetable Price High : తుపాను ప్రభావంతో ఓ వైపు పంటలు నష్టపోతుంటే మరోవైపు ఉత్తరాంధ్రలో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలు కూరగాయల పేరు చెబితేనే హడలిపోతున్నారు. గులాబ్ తుఫాన్ తర్వాత జిల్లాలో పరిస్థితి మారిపోయింది. జిల్లాలో 300 ఏకరాల్లో కూరగాయిల పంట ద్వంసం అవ్వగా .. ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాలో కూడా భారీగా కూరగాయల తోటలకు నష్టం వాటిల్లాయి. దీంతో కూరగాయిల ధరలు షాక్ కోడుతున్నాయి. రోజుకో రేటుతో సామాన్యున్ని బెంబేలెత్తిస్తున్నారు.

Read More : Dentons : డెంటన్స్‌‌లో విశాఖ మహిళకు కీలక పదవి

టమాటో కేజీ ధర వారం క్రితం 20 రూపాయిలు ఉండగా ఇప్పుడు 60 రూపాలు పలుకుతోంది. బీరకాయలు 60 రూపాయిలుకు పెరిగిపోగా… చిక్కుల్లు 50 రూపాయిలకు అమ్ముతున్నారు. ఉల్లిపాయుల ధర 40 రూపాయలు దాటింది. వంకాయలు, దోండకాయలు 40 నుంచి 50 రూపాయిలకుపైగా రేటు పలుకుతోంది. వరుస తుఫాన్‌ల కారణంగా ధరలు పెరిగిపోయాయని, వీటికి తోడు పంక్షన్లు, దసరా పండగ రోజులు కావడంతో మరింత రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. స్థానికంగా కూరగాయలకు కొరత ఏర్పడటంతో బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో రవాణా ఖర్చులు కూడా అదనంగా పడుతున్నాయంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏమి కొనాలో..ఏమి తినాలో అర్థం కావడం లేదంటున్నారు.