Tirumala Brahmotsavam: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు..

తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

Tirumala Brahmotsavam: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు..

Tirumala Brahmotsavam

Tirumala Brahmotsavam: తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీరసాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయచేసి, సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ. అదేవిధంగా హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రాత్రికి మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ సందర్భంగా శుక్రవారం నుంచి తిరుమల కనుమదారుల్లో బైకులకు అనుమతిని నిరాకరించారు. రేపు మధ్యా హ్నం నుంచి ద్విచక్రవాహనాలకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అన్నికంపార్టుమెంట్లు భక్తులతో నిండి అర కిలోమీటర్‌ మేర నిలిచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శుక్రవారం శ్రీవారిని 75,382 మంది భక్తులు దర్శించుకోగా 31,424 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు వచ్చిందని వివరించారు.