Srikalahasti CI Anju Yadav : మహిళను బూతులు తిడుతూ, చీర ఊడేలా కొడుతూ.. మరోసారి రెచ్చిపోయిన శ్రీకాళహస్తి మహిళా సీఐ

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఓ మహిళతో సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.

Srikalahasti CI Anju Yadav : మహిళను బూతులు తిడుతూ, చీర ఊడేలా కొడుతూ.. మరోసారి రెచ్చిపోయిన శ్రీకాళహస్తి మహిళా సీఐ

Srikalahasti CI Anju Yadav : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఓ మహిళతో సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.

హోటల్ నడుపుతున్న ఓ మహిళను నిన్న రాత్రి విచక్షణారహితంగా కొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుమారం రేపింది. నడ్డిరోడ్డులో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి, చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా ఆమెను జీప్ ఎక్కించారు సీఐ అంజూ యాదవ్. రాత్రివేళ హోటల్ నిర్వహిస్తున్న మహిళను బూతులు తిడుతూ, చీర ఊడేలా కొడుతూ దారుణంగా ప్రవర్తించారు సీఐ. అంతేకాదు రాత్రి వేళ మహిళను బలవంతంగా జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె ఎంత వేడుకున్నా లేడీ సీఐ కనికరం చూపలేదు. మహిళ అయి ఉండి సాటి మహిళతో అమానవీయంగా వ్యవహరించారు అంజూ యాదవ్.

దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తున్నా.. సీఐ అంజూ యాదవ్ కనికరం చూపలేదని బాధితురాలు కన్నీటిపర్యంతం అయ్యింది. తనకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా సీఐ వినలేదని వాపోయింది. ప్రస్తుతం బాధితురాలు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రాత్రి సమయంలో మహిళపై.. లేడీ సీఐ అంజూయాదవ్ దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బాధిత మహిళ హోటల్‌ నిర్వహిస్తోంది. మహిళ దగ్గరకు వెళ్లిన అంజూ యాదవ్.. ఆమె భర్త ఆచూకీ ఎక్కడని అడిగారు. అయితే తనకు తెలియదని చెప్పడంతో ఆమెపై దాడి చేశారు. నడిరోడ్డులో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆమె చీర ఊడేలా దాడి చేశారు. తర్వాత బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అకారణంగా సీఐ తనపై దాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. తన కుమారుడు వేడుకున్నా పట్టించుకోకుండా దాడి చేశారని వాపోయింది. సీఐ అంజూ యాదవ్ కొంతకాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తోందని మహిళ కుటుంబం ఆరోపించింది. పదకొండున్నర వరకూ హోటల్ నిర్వహించే అవకాశముంటే.. పది గంటలకే వచ్చి తీవ్రంగా దాడి చేశారని.. పైగా మాదే తప్పంటూ.. వీడియోలు తీశారని.. లేకుంటే గంజాయి కేసులు పెడతామని బెదిరించారని బాధితురాలి కుమారుడు వాపోయాడు.

ఆ లేడీ సీఐ ఇదంతా ఎందుకు చేశారంటే.. మామూళ్ల కోసమేనని ఆరోపిస్తున్నారు బాధితులు. మా హోటల్ ఆమె పరిధిలో లేదు. అయినా వచ్చి మాపై దౌర్జన్యానికి దిగారని అంటున్నారు. హోటల్ బాగానే జరుగుతోందిగా.. రూ.30 వేలు మాములు ఇవ్వాల్సిందేనని సీఐ హుకుం జారీ చేసినట్లు బాధితురాలి భర్త ఆరోపించారు.

కాగా, రాత్రి సమయంలో మహిళ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేసి.. ఆమెను స్టేషన్ లో నిర్బంధించిన లేడీ సీఐపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయ్. ఆమె ప్రవర్తనను అంతా తప్పుపడుతున్నారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ఇక, సీఐ అంజూ యాదవ్ గతంలోనూ ఇలాగే దురుసుగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన టీడీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు అంజూయాదవ్. ఇద్దరు వ్యక్తులపై చేయి చేసుకున్నారు.