ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ

AP High Court orders : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణపై ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషనర్‌ తరుపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టులో వాదనలు జరిపారు.

ఇరువురి వాదనలు విన్న కోర్టు… కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరపాలని ఆదేశించింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని స్పష్టం చేసింది. పంచాయతీలో ఉండే ఎవరైనా ఓటరు వీడియో షూట్ చేయాలని కోరితే… వెంటనే కౌంటింగ్‌ను చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే ఏపీలో రెండో విడుత పంచాయతీ ఎన్నకల పోలింగ్ ముగిసింది. మొదటి విడత పోలింగ్ ఈనెల 9న జరుగ్గా, రెండో విడత ఈ నెల 13న నిర్వహించారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. రెండో స్థానంలో టీడీపీ నిలించింది.