Durgagudi Ghat Road Closure : విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత..ఇంద్రకీలాద్రిపై రాకపోకలు బంద్

విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు మూసివేయడంతో ఇంద్రకీలాద్రిపై రాకపోకలకు బ్రేకులు పడ్డాయి. ఘాట్ రోడ్డులో రాక్ పాల్ మిటిగేషన్ పనులతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు.

Durgagudi Ghat Road Closure : విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత..ఇంద్రకీలాద్రిపై రాకపోకలు బంద్

Durgagudi Ghat road closure : విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు మూసివేయడంతో ఇంద్రకీలాద్రిపై రాకపోకలకు బ్రేకులు పడ్డాయి. ఘాట్ రోడ్డులో రాక్ పాల్ మిటిగేషన్ పనులతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు. 2020 దసరా ఉత్సవాల సమయంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

దసరా ఉత్సవాల సమయంలో కొండరాళ్లు విరిగి పడటంతో ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించిన నిధులతో రాక్ మిటిగేషన్ పనులు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

Vijayawada Kanaka Durga Temple : దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినతరం.. రూ.200 ఫైన్

మిగిలిన పనులను కూడా మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఈఓ భ్రమరాంబ చెప్పారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డు రాకపోకలను నిషేధించినట్లు వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు మల్లికార్జున మహా మండపంలోని లిఫ్ట్ మెట్ల మార్గం ద్వారా రావాలని ఆమె కోరారు.