Vijayawada Girl Kidnap : అంగన్‌వాడీ ఆయానే కిడ్నాపర్.. విజయవాడ బాలిక మిస్సింగ్ కేసులో పురోగతి

విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాపర్ విజయను గుడివాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

Vijayawada Girl Kidnap : అంగన్‌వాడీ ఆయానే కిడ్నాపర్.. విజయవాడ బాలిక మిస్సింగ్ కేసులో పురోగతి

Vijayawada Girl Kidnap

Vijayawada Girl Kidnap : విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో పురోగతి కనిపించింది. కిడ్నాపర్ విజయను గుడివాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మరో మహిళతో కలిసి బాలికను విక్రయించినట్లు గుర్తించారు. కిడ్నాపర్ విజయతో పాటు అంగన్ వాడీ ఆయాను పోలీసులు విచారిస్తున్నారు. ఐదు రోజుల క్రితం విజయవాడ రైల్వే స్టేషన్ లో బాలిక కిడ్నాప్ అయ్యింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ నెల 8న బాలిక కిడ్నాప్ అయ్యింది. విజయవాడ రైల్వే స్టేషన్ లో పదో నెంబర్ ప్లాట్ ఫామ్ పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్‌ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉంది. ఆంజనేయులు అక్కడే కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చిత్తు కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

పదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై సాయంత్రం ఆరు గంటల సమయంలో నిద్రపోతున్నారు. వారికి పక్కనే షఫీదా మేల్కొని ఉంది. ఇద్దరు మహిళలు అక్కడికి వచ్చి చాక్లెట్‌ ఇస్తామని పిలిచారు. వారి వద్దకు వెళ్లిన వెంటనే స్టేషన్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. నిద్ర నుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Boy Suicide : పబ్‌జీ గేమ్‌ ఓడిపోవడంతో బాలుడు ఆత్మహత్య

రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక మహిళ చిన్నారిని తీసుకుని పదో నంబర్‌ ప్లాట్‌ఫాం మెట్లపై నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ మహిళ వెనుక మరో మహిళ వెళ్లడం గమనించారు. సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ కేసులో పురోగతి సాధించారు. కిడ్నాపర్ విజయతో పాటు అంగన్ వాడీ ఆయా.. బాలికను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.