శభాష్.. బస్సు కోసం ఊరంతా ఒక్కటైన గ్రామస్తులు.. ప్రభుత్వం చెయ్యలేని పని చేసి చూపించారు

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అంతే, ఊరంతా ఒక్కటయ్యారు. పలుగు, పార పట్టారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకి రిపేరు చేశారు. రాళ్లు, రెప్పలు తొలగించారు. గుంతలు పూడ్చారు. రాకపోకలకు అనువుగా రహదారిని నిర్మించుకుని అందరితో శభాష్ అనిపించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా చెయ్యలేని పనిని వారు స్వయంగా చేసి చూపించారు.

శభాష్.. బస్సు కోసం ఊరంతా ఒక్కటైన గ్రామస్తులు.. ప్రభుత్వం చెయ్యలేని పని చేసి చూపించారు

Villagers Built Road On Their Own

Villagers Built Road On Their Own : ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అంతే, ఊరంతా ఒక్కటయ్యారు. పలుగు, పార పట్టారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకి రిపేరు చేశారు. రాళ్లు, రెప్పలు తొలగించారు. గుంతలు పూడ్చారు. రాకపోకలకు అనువుగా రహదారిని నిర్మించుకుని అందరితో శభాష్ అనిపించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా చెయ్యలేని పనిని వారు స్వయంగా చేసి చూపించారు.

ప్రకాశం జిల్లా పామూరు మండలం రేణిమడుగు, అక్కంపేట రహదారి అధ్వానంగా ఉంది. రోడ్డు మొత్తం రాళ్లు తేలి, గుంతలు ఏర్పడింది. చిల్లచెట్లు దట్టంగా పెరిగి దారి కూడా సక్రమంగా కనిపించడం లేదు. కల్వర్టులు, వాగుల దగ్గర గోతులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఈ గ్రామాలకు బస్సు రాకపోకలను నిలిపి వేశారు. దీంతో ఆయా గ్రామాల వాసులు మండల కేంద్రమైన పామూరు రాకపోకలు సాగించేందుకు.. విద్యార్థులు కంభాలదిన్నె ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ కనిగిరి ఆర్టీసీ సీఐ కామేశ్వరికి ఇటీవల ఆయా గ్రామాల వినతిపత్రం అందజేశారు.

అయితే రహదారి సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చారు ఆమె. బస్సు నడపడం కష్టమని తేల్చి చెప్పారు. దీంతో రెండు గ్రామాల వాసులు ఒక్కటై చర్చించుకున్నారు. తామే రహదారిని బాగు చేసుకోవాలని తలచారు. అనుకున్నదే తడవుగా 20మంది గ్రామస్థులు ఒక జట్టుగా ఏర్పడ్డారు. జేసీబీ, మూడు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి గుంతలు పూడ్పించారు. చిల్ల చెట్లు తొలగించారు. ఎత్తుపల్లాలు సరి చేయించారు. రహదారిని బాగు చేసుకున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి తమ ఊరికి బస్సు నడిపి తమ కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. మరి, ఆర్టీసీ అధికారులు వారి మొరను ఆలకిస్తారో లేదో చూడాలి.